చంద్రబాబు రాకతో అమరావతికి కొత్త కళ.. సీఎం ప్రమాణస్వీకారానికి ప్రత్యేక ఏర్పాట్లు..

ఏపీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు అధికారులు. జూన్ 12న ఉదయం 11.27 కు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 9న ఢిల్లీలో ప్రధాన మోదీ సహా పలువురు కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు చంద్రబాబు. ఈరోజు ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు అమరావతికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని తన నివాసంలో బసచేయనున్నారు.

చంద్రబాబు రాకతో అమరావతికి కొత్త కళ.. సీఎం ప్రమాణస్వీకారానికి ప్రత్యేక ఏర్పాట్లు..
Chandrababu
Follow us

|

Updated on: Jun 10, 2024 | 7:41 AM

ఏపీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు అధికారులు. జూన్ 12న ఉదయం 11.27 కు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 9న ఢిల్లీలో ప్రధాన మోదీ సహా పలువురు కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు చంద్రబాబు. ఈరోజు ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు అమరావతికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని తన నివాసంలో బసచేయనున్నారు. ఇప్పటికే ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించి గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి ప్రధాని మోడీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వీవీఐపీలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. చంద్రబాబు చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. జూన్ 11 రాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఒకసారి ట్రయల్ రన్ కూడా నిర్వహించనున్నారు అధికారులు.

Amaravathi

Amaravathi

అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తుళ్లూరు, తాడేపల్లి, అమరావతి, ఉండవల్లి, గన్నవరం తదితర ప్రాంతాల్లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఈ మూడు భవనాలను నిర్మించారు. ఆ తరువాత ఎలాంటి భవనాలు నిర్మించలేకపోవడంతో తుమ్మ చెట్లు, ముళ్ళ కంపలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి అడవిని తలపిస్తోంది. గత ఐదేళ్లుగా అమరావతి ప్రాంతం ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదు. దీంతో ఎటు చూసినా నిర్మానుష్యంగా మారి ట్రంక్ రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ తొలగిస్తూన్నారు అధికారులు. దీంతో రాజధాని ప్రాంతం కొత్త కళ సంతరించుకుంటోంది. వీటిని తొలగించడానికి గత మూడు రోజులుగా యుద్ధ ప్రాతిపదికన శ్రమిస్తున్నారు. జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు CRDA అధికారులు. పనులు పర్యవేక్షించేందుకు నిన్న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతిలో సుడిగాలి పర్యటన చేశారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత అమరావతిలో నిర్మాణ పనులపై దిశా నిర్దేశం చేస్తున్నారు. అమరావతి రైతులకు రావల్సిన రెండేళ్ల కౌలు నగదుపై ఫైనాన్స్ డిపార్ట్మెంట్‎తో మాట్లాడి క్లియర్ చేస్తామన్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణం తర్వాత తదుపరి ఆదేశాల మేరకు ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. అలాగే గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు చంద్రబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్