Sanghamitra Express: చీరాలలో విరిగిన రైలు పట్టా.. స్థానికుల సమాచారంతో తప్పిన ముప్పు..

|

Jun 23, 2023 | 4:18 AM

ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటన మరుకముందే.. మరోసారి రైల్వే అధికారుల అలసత్వం బయటపడింది. బాపట్ల జిల్లా చీరాలలో సంఘమిత్ర ట్రైన్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈపుపాలెం స్ట్రైట్ కాలువ బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్ జాయింట్ వీరిగిపోయింది.

Sanghamitra Express: చీరాలలో విరిగిన రైలు పట్టా.. స్థానికుల సమాచారంతో తప్పిన ముప్పు..
Sanghamitra Express
Follow us on

ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటన మరుకముందే.. మరోసారి రైల్వే అధికారుల అలసత్వం బయటపడింది. బాపట్ల జిల్లా చీరాలలో సంఘమిత్ర ట్రైన్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈపుపాలెం స్ట్రైట్ కాలువ బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్ జాయింట్ వీరిగిపోయింది. ట్రాక్ విరిగిపోవడాన్ని గమనించిన స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు విజయవాడ నుండి చెన్నై వైపు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్ ప్రెస్‌ను సుమారు 40 నిమిషాల పాటు నిపివేశారు. మరమత్తులు చేశారు. దీంతో పెను ప్రమాదం సెకన్ పాటులో తప్పింది.ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

గతంలోను అదే ట్రక్‌ను అధికారులు జాయింట్ చేశారు. మరోసారి అదే జాయింట్ ఊడి పోయింది. దీనిని బట్టి చూస్తే రైల్వే అధికారులు మరమత్తుల విషయంలో నిర్లక్ష్యం కళ్ళ కు కట్టినట్లు కనిపిస్తోంది. స్థానికులు గమనించకుంటే జరిగే ప్రమాదానికి ఎవరు సమాధానం చెప్పాలి అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..