APSRTC: ఈ ఒక్క బస్‌పాస్ ఉంటే చాలు.. 10 రోజుల ఛార్జీ చెల్లించి 30 రోజులు ప్రయాణం చేయొచ్చు.. ఆర్టీసీ బంపర్ ఛాన్స్..

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ఏరో ఏసీ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రత్యేక బస్ పాస్‌లను ప్రవేశపెట్టింది. ఈ బస్ పాస్‌లకు రాయితీ సౌకర్యం కూడా కల్పించింది. ఈ వివరాలు చూద్దాం.

APSRTC: ఈ ఒక్క బస్‌పాస్ ఉంటే చాలు.. 10 రోజుల ఛార్జీ చెల్లించి 30 రోజులు ప్రయాణం చేయొచ్చు.. ఆర్టీసీ బంపర్ ఛాన్స్..
Apsrtc

Updated on: Oct 12, 2026 | 10:53 AM

ఏపీలో గత కొద్ది నెలల క్రితం భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనికి అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌గా నామకరణం చేశారు. ప్రస్తుత అంతర్జాతీయంగా విమానాశ్రయం నుంచి ప్యాసింజర్ ఫ్లైట్లతో పాటు సరుకు రవాణా కూడా జరుగుతోంది. అయితే ఈ ఎయిర్‌పోర్ట్‌కు ప్రజలు సులభతరం చేసుకునేలా విశాఖపట్నం నుంచి ప్రత్యేక బస్సులను ఏపీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. ఏరో ఏసీ ఎక్స్‌ప్రెస్ పేరుతో వీటిని నడుపుతోండగా.. తాజాగా ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సుల్లో నెలవారీ బస్ పాస్‌లను ప్రవేశపెట్టగా.. మరో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. ఈ బస్ ద్వారా 10 రోజుల ఛార్జీతో 30 రోజుల పాటు ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం మొత్తం 20 బస్సులు ఎయిర్‌పోర్ట్‌కు నడుస్తున్నాయి.

ప్రయాణికులకు సులభతర ప్రయాణం అందించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ నెలవారీ సీజన్ పాస్‌లను తీసుకొచ్చింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లోని అరైవల్ బ్లాక్ దగ్గర కౌంటర్‌లో ఈ పాస్‌లను ప్రయాణికులు తీసుకోవచ్చు. ఇక విశాఖపట్నంలోని బస్టాండ్లలో కూడా వీటిని పొందవచ్చు. రాయితీ సౌకర్యంతో ఈ బస్ పాస్‌లు తీసుకొచ్చామయని, 10 రోజుల ప్రయాణ ఛార్జీతో 30 రోజుల పాటు ప్రయాణించవచ్చని ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. పాత గాజువాక నుంచి నేషనల్ హైవే మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు రోజూ 10 ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తుంగా.. పాత గాజువాక నుంచి బీచ్ రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లకు మరో 10 బస్సులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రతీ 15 నిమిషాలకు ఒక్కొ బస్ అందుబాటులో ఉంటుంది. బోర్డింగ్ పాయింట్‌ను బట్టి బస్ చార్జీల ధరలు మారతాయి.

గురుద్వారా నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు బస్ పాస్ ధర రూ.6 వేలుగా ఉండగా.. ఐటీ హిల్స్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు రూ.5 వేలు, ఆనందపురం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు రూ.3 వేలు, ఎయిర్ పోర్ట్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్‌కు రూ.వెయ్యిగా నిర్ణయించారు. ఇక జనరల్ బస్ పాస్ ధర రూ.7 వేలుగా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు రాకపోకలు పెరిగాయి. ఇప్పటికే ప్రభుత్వం రోడ్డులను అభివృద్ది చేసింది. దీంతో వేగంతంగా ప్రయాణికులు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే రోడ్డులను అభివృద్ది చేశారు. దీంతో ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తంది. రాబోయే రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ప్రజల రాకపోకలు మరింత పెరిగే అవకాశముంది. దీంతో ఇప్పటినుంచే ప్రభుత్వ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us