Andhra Pradesh Rain Alert: ఉత్తర అండమాన్ సముద్రము.. దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాగల 36 గంటలలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయని అమరావతిలోని వాతావరణ శాఖ సంచాలకులు తెలియజేశారు:
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. కొన్ని ప్రదేశములలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది .
రాయలసీమ:
ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఇక, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
Read also: Minister Kodali Nani: పవన్ కళ్యాణ్ కమ్మవారికి సపోర్ట్‌గా ఉంటానని చెప్పడం సిగ్గుచేటు: కొడాలి నాని