వెద‌ర్ వార్నింగ్ః ఈ రోజు, రేపు ఏపీలో భారీ వ‌ర్షాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొన్ని రోజుల నుంచి వ‌రుస‌గా భారీ వ‌ర్షాలు ప‌డుతూనే ఉన్నాయి. క‌రోనా వైర‌స్‌కి తోడు ఈ వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. తాజాగా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఏపీలోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు..

వెద‌ర్ వార్నింగ్ః ఈ రోజు, రేపు ఏపీలో భారీ వ‌ర్షాలు..

Edited By:

Updated on: Jul 26, 2020 | 5:47 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొన్ని రోజుల నుంచి వ‌రుస‌గా భారీ వ‌ర్షాలు ప‌డుతూనే ఉన్నాయి. క‌రోనా వైర‌స్‌కి తోడు ఈ వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. తాజాగా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఏపీలోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ‌ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న మ‌ధ్య అండమాన్‌ స‌ముద్ర ప్రాంతాల‌లో 2.1 కిలీ మాటర్ల నుండి 3.6 కిలీ మీట‌ర్ల ఎత్తు మ‌ధ్య ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డింది. దీంతో ఏపీలో రాగ‌ల మూడు రోజుల పాటు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఉత్త‌ర కోస్తాంధ్ర‌, యానాంల‌లో ఈ రోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. అలాగే ద‌క్షిణ కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో ఈ రోజు తేలిక‌పాటి నుండి ఒక మోస్త‌రు వ‌ర్షాలు కొన్నిచోట్ల ప‌డ‌నున్నాయి. ఇక రేపు, ఎల్లుండి అక్క‌డ‌క్క‌ భారీ వ‌ర్షాలు ప‌డే ఛాన్స్ ఉన్న‌ట్లు వెద‌ర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు.

Read More: 

మొద్దు నిద్రే క‌రోనాకు చెక్ అట‌..

వైర‌ల్ వీడియో: వ‌రుస‌గా రోడ్డు దాటుతున్న మొస‌ళ్లు.. ఆశ్చ‌ర్య‌పోయిన జ‌నం..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌ మెగాస్టార్‌, ప‌వ‌ర్ స్టార్‌

Follow Us