AP Weather Alert: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వాసులకు వేసవితాపం నుంచి ఉపశమనం ఇచ్చే అమరావతి వాతావరణ శాఖ చల్లటి కబురును చెప్పింది. దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు(Tamilanadu) తీరం వెంబడి ఉన్న ,పశ్చిమ మధ్య బంగాళా ఖాతంతో పాటు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళా ఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం, సగటు సముద్ర మట్టం మీద 1 . 5 కి.మీ నుంచి 3 . 6 కి .మీ. మధ్య వ్యాపించి ఉంది. దీంతో నేటి నుంచి 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర: ఈరోజు , రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . రేపు , ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు , ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
అయితే ఈ అకాల వర్షాలతో పంట చేతికి వచ్చే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.