TDP: లోకల్‌ పోరు.. 36 మందితో తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ.. ఇదిగో పూర్తి లిస్ట్‌ ఇదే!

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దించేందుకు టీడీపీ 36 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ మొత్తం 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల్లో పోటే చేయనుండగా.. ఈ మేరకు ఆయా స్థానాలకు అభ్యర్థులను అధికారింకంగా ప్రకటించింది టీడీపీ.. మరీ ఈ లిస్ట్‌లో ఎవరెవరున్నారో చూద్దాం పదండి.

TDP: లోకల్‌ పోరు.. 36 మందితో తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ.. ఇదిగో పూర్తి లిస్ట్‌ ఇదే!
Tdp Releases First List Of 36 Candidates

Updated on: Oct 17, 2026 | 7:20 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు,నగర పంచాయతీల స్థానాలు ఉన్నాయి. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 11 కార్పొరేషన్లలో పోటీ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 10 స్థానాల్లో తాజాగా 7 చోట్ల మేయర్ అభ్యర్థులను ఖరారు చేసింది. అలాగే మొత్తం 78 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పార్టీ పోటీ చేస్తుండగా, మొదటి విడతగా 29 స్థానాలకు చైర్‌పర్సన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

7 కార్పొరేషన్లలో పోటీ చేయనున్న అభ్యర్థులు వీరే

  • కర్నూల్ మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష
  • కడప మేయర్ అభ్యర్థిగా నెల్లుటూరి సువర్ణ
  • నెల్లూరు మేయర్ అభ్యర్థిగా రూప్‌ కుమార్
  • విశాఖ మేయర్ అభ్యర్థిగా ముక్కా శ్రావణి
  • విజయనగరం మేయర్ అభ్యర్థిగా అనవపు భార్గవి
  • చిత్తూరు మేయర్‌ అభ్యర్థిగా కటారి హేమలత
  • తిరుపతి మేయర్ అభ్యర్థిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్

29 మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే

  • ఆళ్లగడ్డ టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా అనీషా షేక్‌
  • అద్దంకి టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా కాకాని అశోక్‌
  • ఆదోని టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా నాగమణి
  • ఆత్మకూరు మున్సిపల్‌ అభ్యర్థిగా గోవిందరాజులు
  • బద్వేలు టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా దివ్యతేజ
  • బొబ్బిలి టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా రేణుకాదేవి
  • దాచేపల్లి మున్సిపల్‌ అభ్యర్థిగా టి.శ్రీనివాసరావు
  • ధర్మవరం టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా పరిశె సుధాకర్
  • మాచర్ల టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా ఏనుముల సుష్మ
  • మదనపల్లె టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా చిన్నబాబు
  • మార్కాపురం మున్సిపల్‌ అభ్యర్థిగా మల్లికార్జున
  • నగరి టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా శ్రీనివాసన్‌
  • పలాస కాశీబుగ్గ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని
  • పెద్దాపురం టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా LSN రాజు
  • పెనుకొండ మున్సిపల్‌ అభ్యర్థిగా త్రివేంద్రమూర్తి
  • పులివెందుల టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా గీతాకుమారి
  • రాజంపేట టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా గాయత్రి
  • రామచంద్రపురం టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా శేషారావు
  • రాయచోటి టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా ఖాదర్‌ వలీ
  • రాయదుర్గం టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా హనుమంతు
  • రేపల్లె టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా అపర్ణ
  • సూళ్లూరుపేట టీడీపీ మున్సిపల్‌ అభ్యర్థిగా సుహాసిని

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us