Andhra Pradesh: బీభత్సం.. భయానకం.. ఏపీలో సలాసలా స్థానికం.. నెక్ట్స్ ఏం జరగనుంది..?

మీరు గమనించారా? ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లకు.. ఏపీలో స్థానిక ఎన్నికల సమరానికి లింకుపెట్టి సోషల్‌మీడియాలో ఒక హ్యాష్‌ట్యాగ్ ట్రెండైంది మొన్నటిదాకా. ఔను, యూరప్‌ ఖండంలో లోకల్ సమస్యలతో జనం రోడ్డెక్కి, ఆరేడుదేశాలు భగ్గుమంటున్నాయి. అక్కడి విధ్వంసపు సీన్లకు ఏపీలో నామినేషన్ దాఖలు ఘట్టంలో నమోదైన చెదురుమదురు టెన్షన్ సీన్లకు పోలిక పెట్టి.. అదో రకం పండగ చేసుకుంది సోషల్ మీడియా. కానీ, ఇందులో నిజమెంత? అతిశయోక్తి ఎంత? అనేది దగ్గరినుంచి చూసినవాళ్లకే తెలియాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం వయొలెంట్ కంటెంట్‌పై పూర్తి డేటా తెప్పించుకుంది. ఎన్నికల తంతుపై పట్టు గట్టిగానే బిగించినట్టుంది. ఏపీ లోకల్‌ వార్.. సెకండాఫ్ ఎలా ఉండబోతుంది.

Andhra Pradesh: బీభత్సం.. భయానకం.. ఏపీలో సలాసలా స్థానికం.. నెక్ట్స్ ఏం జరగనుంది..?
Ap Municipal Elections Violence

Updated on: Oct 22, 2026 | 9:56 PM

స్థానికసంస్థల ఎన్నికలంటేనే అంత. పక్కా ఇగోయిస్టిక్. ఎప్పటికప్పుడు నివురుగప్పిన నిప్పులానే ఉంటుంది అక్కడి రాజకీయ వాతావరణం. అధిష్టానాలు వద్దువద్దని వారిస్తున్నా, లీడర్లు జరభద్రం అని హెచ్చరిస్తున్నా, క్యాడర్లు మాత్రం కసిమీదే ఉంటాయి. ఎటుసైడు నుంచో ఒక కనుసైగ చేస్తే చాలు రెచ్చిపోడానికి సిద్ధం అనేస్తాయి. ఈసారి కూడా అదే రిపీటైందా? ఎవ్వరు ఎవ్వరికీ తగ్గిన దాఖలా లేదు. ఏపీలో లోకల్‌వార్‌కి షెడ్యూల్ రిలీజై.. ఫస్ట్‌ చాప్టర్‌లో పురపాలికల్లో నామినేషన్ ఘట్టం మొదలయ్యీ కాగానే, ఊరుపక్క గడబిడ షురూ ఐంది. అటు, సిక్కోలు నుంచి ఇటు అనంతపురం దాకా.. కాస్త అటూఇటూగా అన్నిప్రాంతాలూ వేడెక్కాయి. రాయలసీమలో ఐతే మోతాదు కూసింత ఎక్కువే కనిపించింది. కొన్నిచోట్ల పోలీసులు కూడా గాయపడ్డ సీన్లు కనిపించాయి. 11 జిల్లాల్లో 76 వయొలెంట్ సీన్లు.. పుంగనూరు, రాయచోటి, కడప, తిరుపతిలో ఘోరమైన హింస.. ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. ఇలా ఆధారాలతో సహా కోర్టుకెక్కింది వైసీపీ. తమ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లకుండా అధికార పార్టీ అడ్డుకుందని, పోలీసులను అడ్డుపెట్టుకుని, నామినేషన్ పత్రాలను లాక్కొని చింపేశారని తీవ్రమైన అభియోగాలు మోపింది. ప్రతిపక్ష అభ్యర్థులను గృహనిర్బంధం చేస్తున్నారని గగ్గోలు పెట్టింది. గవర్నర్‌కు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌కు కంప్లయింట్లు కూడా ఇచ్చింది వైసీపీ అధిష్టానం. కానీ,...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి