
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు అదిరిపోయే శుభవార్త అందించింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు రూ. 20,000 ఆర్థిక సాయాన్ని అందించేందుకు సర్కార్ సిద్ధమైంది.
సముద్ర సంపద రక్షణ, చేపల పునరుత్పత్తి కోసం ప్రతి ఏటా వేసవిలో చేపల వేటపై నిషేధం విధిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 (నేటి) నుండి జూన్ 14 వరకు (మొత్తం 61 రోజులు) ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
ఇది కూడా చదవండి: AC Offer: ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి.. రిలయన్స్ అదిరిపోయే ఆఫర్లు!
ప్రస్తుతం తీర ప్రాంత గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతోంది. మత్స్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. పారదర్శకత కోసం ఎంపికైన వారి జాబితాను స్థానిక సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. తుది జాబితా ఖరారు కాగానే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది.
వయస్సు: 18 నుండి 60 ఏళ్ల మధ్య ఉండాలి. మత్స్యశాఖలో నమోదైన యాంత్రీకరణ, మోటరైజ్డ్ లేదా సంప్రదాయ పడవల్లో పనిచేసే కార్మికులు, యజమానులు అందరూ అర్హులు. అలాగే గత ఏడాది సుమారు 1.30 లక్షల కుటుంబాలకు ఈ సాయం అందింది.
ఇది కూడా చదవండి: Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు ఈ కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మత్స్యకార కుటుంబాలకు ఈ వేసవిలో పెద్ద ఊరట లభించనుంది.
ఇది కూడా చదవండి: Indian Railways: రైలు ప్రయాణికులకు బంపర్ ఆఫర్..3 నెలల వరకు రైల్వే టికెట్లపై తగ్గింపు!
ఇది కూడా చదవండి: ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు ఇవే..!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి