
టాలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు.. ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ చేపట్టినా సహకరించడానికి మేం ఎప్పుడూ సిద్దం… ఏపీ ప్రభుత్వం కూడా జర ఇటువైపు చూడాలె! సరిగ్గా మూడునెలల కిందట మార్చి మూడోవారంలో గద్దర్ అవార్డుల ప్రదానంలో మెగాస్టార్ చిరంజీవి అంటించిన చురక ఇది. రెండురాష్ట్రాల్లోనూ డిబేటబుల్ పాయింట్ ఐంది. కూటమి ప్రభుత్వానికైతే చురుక్కున అంటుకుంది కూడా. వెంటనే ఉలిక్కిపడి… నంది అవార్డులు వచ్చేస్తున్నాయ్, ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నామ్ అని అనౌన్స్‌మెంట్ కూడా జారీ ఐంది. మరి, మాకేంటి అని సినిమా స్టయిల్‌లోనే సెటైరికల్‌గా అడిగేశారు సినిమాటోగ్రఫీ మంత్రి. ఇండస్ట్రీ వైపు నుంచి కోఆపరేషన్ ఎక్కడ అనేది ఆయన ప్రశ్న. అప్పుడు మాటలయ్యాయి.. ఇదిగో ఇప్పుడు యాక్షన్ పార్టే షురూ ఐందా? అల అమరావతిపురంలో ఒక అరుదైన దృశ్యం… ఆవిష్కారమైందా..? లైట్స్‌ఆన్… కెమెరా.. యాక్షన్. అమరావతిలో అట్టహాసంగా ఫస్ట్ క్లాప్. బాక్సాఫీస్ బొనాంజా బాలయ్యపై మంత్రి నారా లోకేష్ క్లాప్ కొట్టగా ఏపీ రాజధాని వేదికగా ఒక సినిమా స్టార్ట్ అయింది. బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అంటే, ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఏ పేరుమోసిన స్టూడియోలోనో చేస్తారు. కానీ, ఆ సెంటిమెంట్ పక్కకెళ్లిపోయి, అమరావతిలోని వెంకటాయపాలెం...