AP Govt Meat Mart: క్వాలిటీ మటన్ అందించడమే టార్గెట్.. మీట్ మార్టుల ఏర్పాటు దిశగా ఏపీ సర్కార్..

నిన్న సినిమా టికెట్ల విక్రయానికి ముందుకొచ్చిన ఏపీ ప్రభుత్వం, ఇవాళ ఇంకో నిర్ణయం తీసుకుంది. మాంసం విక్రయాలనూ ప్రభుత్వమే చేపట్టబోతోంది. ఏపీ ప్రభుత్వం వెరైటీ పాలనా విధానాలతో ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది.

AP Govt Meat Mart: క్వాలిటీ మటన్ అందించడమే టార్గెట్.. మీట్ మార్టుల ఏర్పాటు దిశగా ఏపీ సర్కార్..
Meat Mart
Follow us

|

Updated on: Sep 09, 2021 | 2:26 PM

నిన్న సినిమా టికెట్ల విక్రయానికి ముందుకొచ్చిన ఏపీ ప్రభుత్వం, ఇవాళ ఇంకో నిర్ణయం తీసుకుంది. మాంసం విక్రయాలనూ ప్రభుత్వమే చేపట్టబోతోంది. ఏపీ ప్రభుత్వం వెరైటీ పాలనా విధానాలతో ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఓవైపు అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకత కనిపించేలా, మరోవైపు ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్యకరమైన మాంసం విక్రయించే లక్ష్యంగా మటన్ మార్ట్‌లను ఏర్పాటు చేయబోతోంది. ముందుగా విశాఖ, విజయవాడల్లో నాలుగు చొప్పున మటన్ మార్కెట్లు ఏర్పాటు చేస్తోంది. తర్వాత మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూడా మటన్ మార్కెట్లు రాబోతున్నాయి. మొత్తం 11కోట్ల 20లక్షలో 112 మటన్ మార్కెట్లు ఏర్పాటు చెయ్యాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

నిన్న సినిమా టికెట్లు…

సినిమా టికెట్ల బుకింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త విధానం తీసుకురాన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సింగిల్ థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల్లో సినిమా టిక్కెట్ల విక్రయానికి సంబంధించి ప్రభుత్వమే ఓ పోర్టల్‌ డెవ‌ల‌ప్‌ చేయాల‌ని ప్రతిపాదించింది. ముఖ్య కార్యద‌ర్శి కుమార్ విశ్వజిత్ నేతృత్వంలో 8 మంది అధికారుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది. టికెట్ల బ్లాక్ మార్కెట్‌ అరిక‌ట్టడంతోపాటు.. టికెట్ల విక్రయంలో యూనిఫామిటీ తీసుకువ‌చ్చేందుకే ఈ ప్రతిపాదన అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఆన్‌లైన్ విధానంలో ప్రత్యేక పోర్టల్ తీసుకువ‌చ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. పెద్ద హిరోలు, పెద్ద నిర్మాత‌లు సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు.

ఇవి కూడా చదవండి: Apple Ice Cream : రుచికరమైన యాపిల్ ఐస్ క్రీమ్‌ను ఇంట్లో ప్రయత్నించి చూడండి.. చాలా ఈజీ..

China-taliban: తాలిబన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న డ్రాగన్ కంట్రీ.. భారీగా ఆర్ధిక సహాయం..