Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు… ఆ విభాగంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా..

పోర్ట్‌ ఆధారిత మౌలిక వసతుల కల్పన విభాగంలో దేశంలోనే ఆంధప్రదేశ్‌ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్‌ సలహాదారు సుదేందు జె సిన్హా నేతృత్వంలోని...

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు... ఆ విభాగంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా..
Ap Govt

Updated on: Sep 28, 2022 | 8:15 PM

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌’ ఇచ్చిన ఈ అవార్డు ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. పోర్ట్‌ ఆధారిత మౌలిక వసతుల అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్‌కు ఈ వార్డు వరించింది. పోర్ట్‌ ఆధారిత మౌలిక వసతుల కల్పన విభాగంలో దేశంలోనే ఆంధప్రదేశ్‌ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్‌ సలహాదారు సుదేందు జె సిన్హా నేతృత్వంలోని జ్యూరీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఈ అవార్డుకి ఎంపిక చేసింది.

ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్‌తో పాటు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, మారిటైం డిప్యూటీ సీఈఓ రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున పోర్టులను నిర్మిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అవార్డు కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఇదిలా ఉంటే బుధవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని గుడివాడ అమర్నాథ్‌ కలిశారు. ఈ సందర్భంగా అవార్డు వివరాలను సీఎంకి వివరించగా, మంత్రిని జగన్‌ అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us