ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకు మరోసారి పెరుగుతోంది. నిన్నటి కంటే ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్యతోపాటు మృతుల సంఖ్య కూడా పెరిగింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 52,319 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,115 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2014116కి చేరింది. కొత్తగా 19 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13857 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,265 మంది వైరస్ కారణంగా కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1985566కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14693 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,66,29,314 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణ జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు,తూర్పు గోదావరి,శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొ క్క రు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కాగా చిత్తూరు జిల్లాలో ప్రమాదకరంగా 210 కొత్త కేసులు వెలుగుచూశాయి.
#COVIDUpdates: 31/08/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,11,221 పాజిటివ్ కేసు లకు గాను
*19,82,671 మంది డిశ్చార్జ్ కాగా
*13,857 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,693#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dbGhdSbfNd— ArogyaAndhra (@ArogyaAndhra) August 31, 2021
కరోనా సమాచారం మీ చేతుల్లోనే:
● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
● వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.
ఇవి కూడా చదవండి: Terrorists Planning: భారీ దాడులకు టెర్రరిస్టుల ప్లాన్.. ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్