Andhra Pradesh: కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. ఎంత సింపుల్ అంటే..

ఏపీ ప్రభుత్వం కుల ధృవీకరణ పత్రాన్ని ఇంటి నుంచే వాట్సాప్ ద్వారా రీ-ఇష్యూ చేస్తోంది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ఇది సులువుగా పొందవచ్చు. రూ.40 ఫీజు చెల్లిస్తే వాట్సప్‌లోనే సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఈ ప్రక్రియ ఎలా అనేది చూద్దాం.

Andhra Pradesh: కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. ఎంత సింపుల్ అంటే..
Caste Certificate

Updated on: Oct 23, 2026 | 10:44 PM

ఏపీ ప్రభుత్వం పౌరులకు ఇంటి నుంచే ప్రభుత్వ సేవలను అందించేందుకు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా మీసేవ, గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. అనేక రకాల సర్టిఫికేట్లు వాట్సప్‌లోనే సులువుగా పొందవచ్చు. తాజాగా కుల ధృవీకరణ పత్రం(Caste Certificate)ను కూడా ఇందులో ప్రభుత్వం చేర్చింది. ప్రబుత్వ పథకాలకు, ఉద్యోగాలు, విద్యా సంబంధిత అవసరాలకు క్యాస్ట్ సర్టిఫికేట్ కీలకంగా మారింది. దీంతో ఎమ్మార్వో, గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగుండా ఎవరైనా సులువుగా పొందే విధంగా వాట్సప్ గవర్నెన్స్‌లో దీనిని జోడించింది.

వాట్సప్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ పొందటం ఎలా..?

-ఏపీ ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009ను మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోండి

-ఆ తర్వాత వాట్సప్‌ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపండి.

-అనంతరం కేటగిరీలో రెవెన్యూ సేవలు (Revenue Services) ఎంచుకోండి

– రెవెన్యూ సేవలలో క్యాస్ట్ రీ-ఇష్యూ క్యాస్ట్ అనే ఆప్షన్ఎంచుకోవాలి.

-తదుపరి మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి OTP ద్వారా ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయండి

-అనంతరం మీ పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా భర్త పేరు వంటి వ్యక్తిగత వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయో.. లేదో చెక్ చేసుకోండి

– ఏ డిపార్ట్‌మెంట్ కోసం అవసరమో (కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, లేదా ఇతర), ఏ ఉద్దేశ్యంతో (విద్య, రుణం, పథకాలు, పేరు సరిదిద్దడం) తీసుకుంటున్నారో పేర్కొనండి

– మీ గత కుల ధృవీకరణ పత్రం వివరాలు లేదా సుమోటో సర్టిఫికెట్ సమాచారం ఇక్కడ కనిపిస్తాయి.

-C సిరీస్‌తో ఉన్నట్లయితే మీరు గతంలో సర్టిఫికెట్ తీసుకున్నారని, S సిరీస్‌తో ఉన్నట్లయితే అది ప్రభుత్వం ఆటోమేటిక్‌గా జారీ చేసిన సుమోటో సర్టిఫికెట్ అని అర్థం. ఈ వివరాలు జాగ్రత్తగా పరిశీలించుకోండి.

-అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత చివరిలో ఉన్న డిక్లరేషన్ బాక్స్‌లను టిక్ చేసి, దరఖాస్తును సమర్పించండి.

-ఆ తర్వాత రూ.40 ఫీజు డిజిటల్ విధానంలో చెల్లించండి

-అనంతరం వాట్సప్‌లో మీకు కుల ధృవీకరణ పత్రం PDF రూపంలో అందుతుంది

-వాట్సాప్‌లో వచ్చినట్లు నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి ఉండటం ముఖ్యం

 

Loading...
Unable to load recommendations.
Follow Us