AP Rains: తుఫాన్ వీడింది.. ఏపీలో ఇంకా వర్షాలు కొనసాగుతాయా.? తాజా వెదర్ రిపోర్ట్

|

Dec 03, 2024 | 1:14 PM

ఏపీలో ఇంకా వర్షాలు కొనసాగుతాయా.? ఫెయింజల్ తుఫాన్ ముప్పు వీడింది. మరి వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ స్టోరీ చదివేయండి..

AP Rains: తుఫాన్ వీడింది.. ఏపీలో ఇంకా వర్షాలు కొనసాగుతాయా.? తాజా వెదర్ రిపోర్ట్
Andhra Weather
Follow us on

ఈరోజు అనగా 2024, డిసెంబర్ 3న ఉదయం 8.30 గంటల సమయంలో కోస్టల్ కర్ణాటక, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉన్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం అదే చోట కొనసాగుతోంది. దీని అనుబంధ ఉపరితల అవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 2 రోజులు పాటు మధ్య అరేబియా సముద్రం లో కొనసాగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి.

———————————-
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
—————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
—————————————-

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
——————————

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:-
—————–

ఈరోజు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.