AP Covid-19: ఏపీని వెంటాడుతున్న కరోనా మహమ్మారి.. పెరుగుతున్న కరోనా కేసులు.. మరణాలు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

AP Corona Updates: ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోవంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు..

AP Covid-19: ఏపీని వెంటాడుతున్న కరోనా మహమ్మారి.. పెరుగుతున్న కరోనా కేసులు.. మరణాలు.. తాజాగా ఎన్ని కేసులంటే..!
Follow us

|

Updated on: May 20, 2021 | 5:48 PM

AP Corona Updates: ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోవంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1,01,281 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 22,610 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది. కొత్తగా 114 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్య 1521142కు చేరగా, మృతుల సంఖ్య 9,800లకు చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 23,098 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మొత్తం ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1299313 ఉంది. ప్రస్తుతం రాష్టర్ంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 209134 ఉంది. అయ్యారు. ఇక తాజాగా మరణాలు పశ్చిమగోదావరి జిల్లాలో 15, చిత్తూరులో 10, తూర్పు గోదావరిలో 10, గుంటూరులో 10, విశాఖలో 10, అనంతపురంలో 9, విజయనగరంలో 9, కృష్ణాలో 8, కర్నూలులో 7, ప్రకాశంలో 7, నెల్లూరులో 5, శ్రీకాకుళంలో 5, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,83,42,918 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇవీ చదవండి:

Indian Gas: గ్యాస్‌ సిలిండర్‌ వాడే వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..

Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌పై కేంద్రం కీలక ప్రకటన.. అంటు వ్యాధిగా గుర్తించాలంటూ రాష్ట్రాలకు లేఖ.. కీలక సూచనలు