AP Weather: ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

|

Apr 25, 2024 | 1:37 PM

అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి సంబంధించి తాజా వెదర్ రిపోర్ట్ ఇచ్చింది. ఆంధ్రాలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలానే కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం...

AP Weather: ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Andhra Weather Report
Follow us on

ఉపరితల ద్రోణి ఇప్పుడు మరాఠ్వాడా & ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర కోస్తా తమిళనాడు వరకు , ఉత్తర అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. అంతేకాకుండా..  తెలంగాణ & దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీద సగటు సముద్ర మట్టానికి 0 . 9 కి మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడినది . దీంతో రాబోయే 3 రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

గురువారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది . ఈదురు గాలులు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

శుక్రవారం :- తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

శనివారం:- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

 

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

గురువారం, శుక్రవారం :- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

శనివారం:- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ :-

గురువారం, శుక్రవారం, శనివారం :- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది . వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…