Andhra Pradesh: దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీకి మరో ముప్పు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌పై మరో వాతావరణ ముప్పు పొంచి ఉంది. అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడుతూ ఏపీ తీరం వైపు పయనిస్తుండటంతో, వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Andhra Pradesh: దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీకి మరో ముప్పు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
Andhra Pradesh Weather Alert

Updated on: Oct 30, 2026 | 2:59 PM

ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం అక్కడే కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సగటు సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ, అక్టోబర్ 31 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్-నికోబార్ దీవుల సమీపంలో మరింత బలపడి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయి. అనంతరం రాబోయే రెండు రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వైపుగా కదిలే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రం, యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయి.

కోస్తాంధ్ర, యానాం పరిధిలో

శుక్ర, శనివారాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే వీలుంది. అక్కడక్కడా పిడుగులు పడే సూచనలు ఉన్నాయి. ఆదివారం వర్ష ప్రభావం కాస్త పెరిగి పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చు. ఈ మూడు రోజులూ తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

రాయలసీమ పరిధిలో

శుక్ర, శనివారాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. ఆదివాకం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు ఒకట్రెండు చోట్ల పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలోనూ గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద లేదా శిథిలావస్థలో ఉన్న భవనాల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us