Andhra Pradesh: ‘తల్లికి వందనం’ నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఆధార్ నెంబర్ ద్వారా అర్హత చెక్ చేస్కోండిలా..

ఏపీలోని విద్యార్థులకు తీపికబురు. ప్రభుత్వం త్వరలోనే తల్లికి వందనం నిధులను పంపిణీ చేయనుంది. ప్రభుత్వ స్కూల్స్ ప్రారంభం కావడంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. అయితే మీ పిల్లలకు అర్హత ఉందా.. లేదా అనేది తల్లిదండ్రులు చెక్ చేసుకోవచ్చు.

Andhra Pradesh: తల్లికి వందనం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఆధార్ నెంబర్ ద్వారా అర్హత చెక్ చేస్కోండిలా..
Thalliki Vandanam

Updated on: Jun 16, 2026 | 12:05 PM

ఏపీలో బడి గంట మోగింది. ప్రభుత్వ స్కూల్స్ ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. తొలిరోజే ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేసింది. అయితే త్వరలో తల్లికి వందనం నిధులు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ పథకం కింద ఏకంగా ఒకేసారి రూ.13 వేలు విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేయనుంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.15 వేలు అందిస్తుండగా.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.2 వేలు తీసుకుంటుంది. మిగతా రూ.13 వేలు అకౌంట్లలో జమ చేస్తోంది. మరికొన్ని వారాల్లో జమ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

మీ అర్హతను చెక్ చేసుకోవచ్చు..

అయితే తల్లికి వందనం పథకం కింద డబ్బులు పొందేందుకు విద్యార్థులు అర్హత సాధించారా.. లేదా అనేది తల్లిదండ్రులు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఆధార్ నెంబర్ ఆధారంగా సెకన్లలోనే ఇంటి వద్ద నుంచి అర్హత స్టేటస్ తెలుసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. విద్యార్థుల అర్హులుగా ఉంటే తల్లిదండ్రులకు నిధులు అందుతాయి. ఒకవేళ ఈ పథకానికి అనర్హులైతే డబ్బులు అందవు. దీంతో విద్యార్థులు డబ్బులు పొందేందుకు అర్హులా.. కాదా అనేది తల్లిదండ్రులు చెక్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.

ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడం ఎలా..?

– https:msgsw.ap.gov.in/ BM/Appinstatus వెబ్‌సైట్ తెరవండి

-పథకం అర్హత అనే ఆప్షన్ ఎంచుకోండి

-కొత్త విండోలో లబ్దిదారుల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి

-ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయండి

-లబ్దిదారుల కుటుంబసభ్యుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి

-గ్రీన్ రంగులో సాటిస్‌ఫైడ్ అని ఉంటే క్వాలిపై అయినట్లు లెక్క. అదే రెడ్ కలర్‌లో అన్‌సాటిస్‌ఫైడ్ అని ఉంటే అనర్హులుగా పరిగణించబడతారు

-అనర్హులుగా తేలితే సచివాలయ అధికారులను సంప్రదించాలి

ఆఫ్‌లైన్‌లో ఎలా తెలుసుకోవాలి..?

మీ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో త్వరలో తల్లికి వందనం లబ్దిదారుల జాబితాను అధికారులు ప్రదర్శించనున్నారు. మీ పరిధిలోని సచివాలయానికి వెళ్లి అర్హత పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేరు ఉంటే త్వరలో జమ చేయనున్న నిధులు అకౌంట్లో పడతాయి. ఒకవేళ పేరు లేకపోతే సచివాలయ అధికారులను అడిగి సమాచారం తెలుసుకోవచ్చు.

Follow Us