Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే?
Andhra Pradesh, Telangana Weather Update

Updated on: Oct 10, 2026 | 3:05 PM

వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల వాతావరణ బులెటిన్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, మధ్యాహ్నం ఎండల కారణంగా ఉక్కపోత ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 3 రోజుల వాతావరణం:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం.. కోస్తాంధ్ర, యానాంలో శనివారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. అలాగే ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. ఇక ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.

ఇక రాయలసీమలో శనివారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

తెలంగాణలో వాతావరణం ఇలా:

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి పూర్తిగా నిష్క్రమించడంతో భారీ వర్షాల ప్రభావం ఉండకపోవచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us