Weather News: ఏపీ, తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయిన తెలిపింది. వర్షాల క్రమంలో పలు సూచనలు చేసింది.

Weather News: ఏపీ, తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Rains

Updated on: Oct 02, 2026 | 2:47 PM

నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఏపీలోని పలు ప్రాంతాలకు వర్షసూచన జారీ చేసింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హెచ్చరించింది. వర్షాల క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏపీకి వర్షసూచన

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. రాయలసీమలో రాబోయే మూడ్రోజలు పాటు తేలికపాటి నుండి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

తెలంగాణలో కూడా వర్షాలు

ఇక తెలంగాణకు కూడా వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అటు తెలంగాణలో ఇటీవల వాయుగుండం ప్రభావంతో భారీ వానలు పడగా.. ఆ తర్వాత వాయుగుండం బలహీనపడటంతో వర్షాలు కురవడం లేదు. రాబోయే మూడ్రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని, ఈదురుగాలులు కూడా బలంగా వీచే అవకాశముందని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us