Andhra Pradesh: రియల్ ‘గబ్బర్‌ సింగ్‌’.. గుర్రంపై స్వారీ.. ఆసక్తికరంగా మారిన ఎస్ఐ వీడియో..!

|

Apr 19, 2022 | 9:36 AM

Andhra Pradesh: పోలీసులు పోలీస్ స్టేషన్‌కు ఎలా వస్తారు? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? ఆగండి ఆగండి.. ఈ ప్రశ్నకు ఒక అర్థం ఉంది.

Andhra Pradesh: రియల్ ‘గబ్బర్‌ సింగ్‌’.. గుర్రంపై స్వారీ.. ఆసక్తికరంగా మారిన ఎస్ఐ వీడియో..!
Si Horse Riding
Follow us on

Andhra Pradesh: పోలీసులు పోలీస్ స్టేషన్‌కు ఎలా వస్తారు? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? ఆగండి ఆగండి.. ఈ ప్రశ్నకు ఒక అర్థం ఉంది. సాధారణంగా అయితే ప్రభుత్వం ఇచ్చిన వాహనాల్లోనే పోలీసు ఉన్నతాధికారులు విధులకు హాజరవుతారు. మరికొందరు తమ స్వంత వాహనాల్లో కార్యాలయాలకు వస్తారు. మొత్తానికి వాహనాల్లోనే వస్తుంటారు. కానీ, ఈ పోలీసు అధికారి మాత్రం చాలా డిఫరెంట్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు సినిమాల్లోనూ మాత్రమే చూసిన సీన్‌ను రియల్ లైఫ్‌లో చేసి చూపించారాయట. ఆయనే ఎస్ఐ మారుతీ శంకర్.

ఎస్ఐ మారుతీ శంకర్ గుర్రంపై స్వారీ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు సినిమాల్లోనే కనిపించిన ఈ సీన్ నంద్యాల జిల్లాలో రియల్‌గా చోటుచేసుకుంది. నందికొట్కూరు జూపాడుబంగ్లా మండలం తర్తురు జాతరలో విధులు నిర్వహిస్తున్న మారుతీ శంకర్‌.. 10 మంది సీపీవోలు, ముగ్గురు కానిస్టేబుల్స్‌తో గుర్రంపై స్వారీ చేస్తూ కనపడ్డారు. ఎస్ఐ అలా గుర్రంపై కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.

ఎస్ఐ మారుతీ శంకర్ గుర్రపు స్వారీ చేస్తూ వెళుతుంటే.. వెనుక పోలీస్ వాహనం వారిని ఫాలో అయింది. చూడటానికి సినిమా షూటింగ్‌లా కనిపించే ఈ సీన్‌.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని వదిలేసి ఇలా గుర్రంపై రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also read:

Funny Video: అయ్యయ్యో వద్దన్నా.. ఈ ఒక్కసారికి వదిలిపెట్టు.. పిల్లి ముందు మోకరిల్లిన ఎలుక..!

Viral Video: పరోటాను చూసి.. పరుగులు తీసిన చైనా ఆర్మీ.. ఫన్నీ వీడియో మీకోసం..!

Andhra Pradesh: అద్భుతం.. సీతారాముల కళ్యాణానికి అతిధిగా వచ్చిన గరుడపక్షి..!