Municipal Election: ఏపీలో పెండింగ్ మున్సిపాలిటీల ఎన్నికలకు డేట్‌ ఫిక్స్‌.. పోలింగ్ ఎప్పుడంటే?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమైంది. ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వారంలోగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 10 నుంచి 12 మధ్యలో నోటిఫికేషన్ విడుదల చేసిన పోలింగ్ తేదీలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Municipal Election: ఏపీలో పెండింగ్ మున్సిపాలిటీల ఎన్నికలకు డేట్‌ ఫిక్స్‌.. పోలింగ్ ఎప్పుడంటే?
Andhra Pradesh Municipal Elections

Updated on: Nov 06, 2026 | 11:39 AM

ఇటీవలే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కొన్ని మున్సిపాలిటీలకు పోలింగ్ జరగగా మరికొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహించలేదు.. కాగా త్వరలో పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. రాష్ట్రంలో పెండింగ్లోని 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈ నెల 10-12 తేదీల మధ్య నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ఎన్నికల సంఘం.

మేయర్, ఛైర్పర్సన్, డివిజన్లు, వార్డు స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిర నేపథ్యంలో.. ఎన్నికల జరిపేందుకు ఈసీ నిర్ణయించింది. ఈ నెల 25వ తేదీలోపు మొత్తం ప్రక్రియను పూర్తిచేసే యోచనలో ఎన్నికల కమిషన్ ఉంది. ఈ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉండటంతో అక్టోబర్ 14న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్లో వీటి ప్రస్తావన లేదు.

కేసుల పరిష్కారంతో వీటిలో ఎన్నికల నిర్వహణకు పురపాలకశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డివిజన్లు/వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల తయారీ, వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసిన యంత్రాంగం.. తాజాగా రిజర్వేషన్లు ఖరారు చేసింది.

పెండింగ్‌లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నాగర పంచాయితీలు ఇవే
శ్రీకాకుళం, రాజమహేంద్రవరం కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి, ఆముదాలవలస, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, గుడివాడ, గూడూరు కందుకూరు, కావలి, నరసరావుపేట, పొన్నూరు, రాజాం, శ్రీకాళహస్తి, తాడిగడప, బాపట్ల, అల్లూరు, చింతలపూడి, పొదిలి, బి కొత్తపేట

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us