
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులతోపాటు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఉపరితల తుఫాను వలయం కారణంగా, గురువారం (06-08-2026) శ్రీ సత్యసాయి, పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. అలాగే.. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మర్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణలో కూడా గురువారం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత జల్లులు కురిసే అవకాశం ఉంది.
ఇవాళ రోజంతా చల్లని వాతావరణం ఉంటుంది. అయితే.. వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలతోపాటు పిడుగులు పడే ఛాన్స్ ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..