AP News: చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోల కేసులో నిందితుడు బాలాజీ చిక్కాడు…

అతగాడి పేరు బాలాజీ. ప్రొఫెషన్‌ లారీ డ్రైవర్‌. చేసేది మాత్రం చైల్డ్‌ పోర్న్‌ దందా. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇటీవల ఛైల్డ్‌ పోర్న్‌ వీడియోలు ఆన్‌లైన్‌లో కలకలం రేపడంతో సీఐడీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంగా సాగుతున్న ఈ గలీజు గ్యాంగ్‌లో మెంబరైన బాలాజీని అరెస్టు చేసి కటకటాల్లో వేశారు.

AP News: చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోల కేసులో నిందితుడు బాలాజీ చిక్కాడు...
Andhra Police

Updated on: Jun 10, 2023 | 7:47 PM

అశ్లీల చిత్రాలు…పోర్న్ వీడియోలు సర్క్యులేట్‌ చేస్తున్న ముఠాలపై ఏపీ సీఐడీ పంజా విసిరింది. ఇటీవల చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు ఆన్‌లైన్‌లో కలకలం రేపడంతో సీఐడీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల జీరో ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది.

చైల్డ్‌ పోర్న్‌ వీడియోలకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసులను ఏపీ సీఐడీ అప్రమత్తం చేసింది. దీంతో చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు మమ్మరం చేశారు. ఆన్‌లైన్‌ పోర్న్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేసేవారిపై నిఘా పెట్టిన పోలీసులు కలికిరిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆన్‌లైన్‌ సెంటర్లపై సైబర్‌ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు కలికిరి కేంద్రంగా అప్‌లోడ్‌ అయినట్లు పోలీసులు నిర్ధారించారు. చైల్డ్ పోర్న్ వీడియోస్ అప్‌లోడ్‌ కేసులో నిందితుడు బాలాజీని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. కలికిరి మండలం మేడికుర్తి క్రాస్ వద్ద అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతగాడు చిక్కకుండా చాలాకాలం పాటు పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టాడు.

చైల్డ్‌ పోర్న్‌ వీడియోస్‌ అప్‌లోడ్‌ చేస్తున్న ఐపీ అడ్రస్‌లను గుర్తించిన ఏపీ సీఐడీ…రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆ సమాచారం అందించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..