Anantapur: మందుబాబులకు గుండె జల్లుమనే ఘటన.. మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేసిన పోలీసులు

మందుబాబుల గుండె జల్లుమనే సంఘటన చోటు చేసుకుంది.వివిధ కేసులలో అక్రమ మద్యం పట్టుబడిన బాటిల్స్ ను రోడ్డు రోలర్ ( Liquor bottles) కింద తొక్కించారు

Anantapur: మందుబాబులకు గుండె జల్లుమనే ఘటన.. మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేసిన పోలీసులు
Illegal Liquor Bottles

Updated on: May 22, 2022 | 6:13 AM

Anantapur: అనంతపురంలో మందుబాబుల గుండె జల్లుమనే సంఘటన చోటు చేసుకుంది. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో భారీ మొత్తంలో మద్యం బాటిల్స్ ను( Liquor bottles) రోడ్డు రోలర్ కింద తొక్కించారు. వివిధ కేసులలో అక్రమ మద్యం పట్టుబడిన బాటిల్స్ ను స్టేషన్ లో గత కొంత కాలంగా భద్రపరిచారు. జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆదేశాల మేరకు డిఎస్పి పర్యవేక్షణలో మద్యం బాటిళ్లను బయటకు తీసి పారబోయడానికి చర్యలు చేపట్టారు. 4వ పట్టణసిఐ జాకీర్ హుస్సేన్, ఎస్సైలు కానిస్టేబుల్ కలిసి రోడ్డు రోలర్ కింద మద్యం సీసాలను తొక్కించి ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా డిఎస్పీ వీరరాఘవరెడ్డి, సెబ్ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివిధ కేసుల్లో పట్టుబడి, సీజ్ చేసిన మద్యం బాటిళ్లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ మద్యం బాటిళ్లను ద్వంసం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు 22 లక్షల రూపాయలు విలువ చేస్థాయని తెలిపారు. మామూలుగా ఒక బాటిల్ చేతిలో నుంచి జారి పోతుందే మందుబాబుల గుండె గుభేల్ మంటుంది. అలాంటివి ఏకంగా భారీ మొత్తంలో మద్యం వృధా అవుతుండడంతో ముందు బాబుల పరిస్థితి వర్ణనానితం.

Loading...
Unable to load recommendations.
Follow Us