Rain Alert: ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

Rain Alert: ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
Rain Alert

Updated on: Jun 28, 2026 | 3:00 PM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఎండలతోపాటు వర్షాలు కురుస్తున్నాయి.. అయితే.. రుతు పవనాలు విస్తరించినప్పటికీ.. ఎల్‌నీనో ప్రభావంతో పెద్దగా వర్షాలు కురవడం లేదు.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై నున్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ద్రోణి ప్రస్తుతం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి:-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :

ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక: కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం – రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

Follow Us