సమస్యలుంటే నాకు ఫోన్‌ చేయండి: కరోనా బాధితులతో మంత్రి ఆళ్ల నాని

కరోనా బాధితులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా తనకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.

సమస్యలుంటే నాకు ఫోన్‌ చేయండి: కరోనా బాధితులతో మంత్రి ఆళ్ల నాని

Updated on: Jul 11, 2020 | 3:06 PM

కరోనా బాధితులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా తనకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనా బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తమకు నాణ్యమైన భోజనం లేదని, దుప్పట్లు ఇవ్వడం లేదని, మరుగుదొడ్లు శుభ్రం చేయట్లేదని కరోనా బాధితులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా 1800 233 1077కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఇక తన నంబర్‌కి ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండగా.. హోమ్‌ క్వారంటైన్‌లో ఉండేవారికి ప్రభుత్వం ఫ్రీ కరోనా కిట్‌ను అందిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us