టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక హాయిగా పాఠాలు వినేయొచ్చు..!

ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ అందించ‌నుంది ఏపీ ప్ర‌భుత్వం. రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రిక్ష‌లు రెండుసార్లు వాయిదా ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ..

టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక హాయిగా పాఠాలు వినేయొచ్చు..!
Follow us

|

Updated on: Apr 18, 2020 | 6:35 AM

ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ అందించ‌నుంది ఏపీ ప్ర‌భుత్వం. రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రిక్ష‌లు రెండుసార్లు వాయిదా ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఇంట్లోనే ఉంటున్న విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల‌కు స్న‌ద్ధం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తోంది. తాజాగా మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది ఏపీ స‌ర్కార్‌.
ప‌దో తరగతి విద్యార్థులకు ఇకపై ఆకాశవాణి ద్వారా ఆడియో పాఠాలు వినిపించాలని ఏపీ ప్ర‌భుత్వం యోచిస్తోంది.  రాష్ట్రంలో ఇప్పటికే సప్తగిరి చానల్ ద్వారా పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్న విద్యా శాఖ ఇప్పుడు, ఆకాశవాణి ద్వారా విద్యార్థులకు ఆడియో పాఠాలు వినిపించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, ప్రాజెక్టు అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ… ఇకపై ఆకాశవాణి ద్వారా  పాఠాలు వినిపించేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులను సమీక్షించుకొని 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కారణంగా ఒకసారి, కరోనా వైరస్ వల్ల మరోసారి 10వ తరగతి పరీక్షలు వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున 10వ తరగతి విద్యార్థులకు విద్యా అమృతం పథకం కింద ప్రతి రోజు దూరదర్శన్ చానల్‌లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బోధనా తరగతులు ఇప్ప‌టికే నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఇక‌పై ఆకాశ‌వాణి ద్వారా కూడా పాఠాలు వినే అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..