AP Rains: హమ్మయ్యా.! తీరం దాటిన వాయుగుండం.. కానీ ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

|

Oct 17, 2024 | 1:57 PM

అక్టోబర్ 17, 2024 నాటికి, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన గాలులకు అవకాశం ఉంది. రాబోవు మూడు రోజులకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి.

AP Rains: హమ్మయ్యా.! తీరం దాటిన వాయుగుండం.. కానీ ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
Andhra Weather Update
Follow us on

దక్షిణ కోస్తాంధ్ర దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా తమిళనాడులో కేంద్రీకృతమైన బాగా గుర్తించంచబడిన అల్పపీడనం దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 06 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశముంది. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతములో అక్టోబర్ 20 వ తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది . దీని ప్రభావంతో అక్టోబరు 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత అది వాయువ్య దిశగా పయనించి మరింత బలపడే అవకాశం ఉంది.

ఇది చదవండి: ఓర్నీ.! ఇంత ఈజీనా.. ఈ ఫోటోలో ‘3’ నెంబర్ కనిపెట్టగలరా..

————————–
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
———————————-

ఈరోజు :-

ఇవి కూడా చదవండి

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు, ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
——————————

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
బలమైన ఈదురు గాలులు గంటకు 35 -45 కిలోమీటర్లు గరిష్టముగా 55 కిలోమీటర్ల వేగముతో వీస్థాయి

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:-
———–

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది,
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
బలమైన ఈదురు గాలులు గంటకు 35 -45 కిలోమీటర్లు గరిష్టముగా 55 కిలోమీటర్ల వేగముతో వీస్థాయి .

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: సింగిల్స్ చూడాల్సిన మూవీ.! ఓటీటీలో బోల్డ్ సీన్స్‌తో రచ్చ రంబోలా..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..