దటీజ్ బాలయ్య… అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కోసం.. !

నంద‌మూరి బాల‌కృష్ణ నటుడిగానే కాదు మంచి మ‌న‌సున్న మనిషిగా ఎందరో మ‌న్నన‌లు పొందుతుంటారు. సినిమాల్లో అభిమానులను అల‌రిస్తూనే వీలైనప్పుడు ప‌లు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. తాజాగా నట సింహం, హిందూపురం ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ మ‌రోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

దటీజ్ బాలయ్య... అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కోసం.. !
Mla Balakrishna Assurance To Little Boy

Updated on: Apr 10, 2026 | 4:56 PM

నంద‌మూరి బాల‌కృష్ణ నటుడిగానే కాదు మంచి మ‌న‌సున్న మనిషిగా ఎందరో మ‌న్నన‌లు పొందుతుంటారు. సినిమాల్లో అభిమానులను అల‌రిస్తూనే వీలైనప్పుడు ప‌లు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. తాజాగా నట సింహం, హిందూపురం ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ మ‌రోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, తన నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న రెండున్నరేళ్ల చిన్నారి పరిస్థితిపై స్పందించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలిచారు.

ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కుటుంబం చిన్నారికి చికిత్స చేయించుకోవ‌డం కష్టంగా మారింది. ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామ నివాసి నటరాజు దంపతుల కుమారుడు కేయాన్ష్ అడ్విక్. వయస్సు రెండున్నర సంవత్సరాలు. చిన్నారి అత్యంత అరుదైన వ్యాధి – స్పైనల్ మస్క్యలర్ అట్రోఫీ టైప్ 2తో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు చికిత్స అందిస్తున్నారు. బేబీ కేయాన్స్ అడ్విక్ గత 21 నెలలుగా ప్రాణాపాయమైన ఆ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు.

అయితే ఈ వ్యాధికి అవసరమైన జీవరక్షక ఔషధం AVXS-101 (Onasemnogene Abeparvovec) అనే మెడిసిన్ భారతదేశంలో తయారు కావడం లేదు. ఇంజెక్షన్ ధర 16 కోట్ల రూపాయలు. ఒక్కసారి మాత్రమే జీవరక్షక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. బిడ్డ ప్రాణాలు దక్కించుకోవాలంటూ 16 కోట్ల రూపాయలు సర్దుబాటు చేయలేక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణ ను కలిసి ఆ కుటుంబం బిడ్డ పరిస్థితిని వివరించారు. బిడ్డ చికిత్స వివరాలు తెలియజేసి సహాయాన్ని కోరుకుతున్నారు. తన వంతుగా సహాయం చేస్తూనే.. ప్రభుత్వ పరంగా కూడా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు.

ఇంత భారీ మొత్తంలో డబ్బును సమకూర్చుకునే పరిస్థితిలో ఆ కుటుంబం లేదు. కావున మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమవంతు సాయంగా ఆ చిన్నారి భవితకు బాటలు వేసేలా అడుగు వేయాలని నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. చిన్నారి వైద్య చికిత్స కోసం సాయం అందించాలని పూర్తి వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు బాలకృష్ణ. కొన ఉపిరితో ఉన్న చిన్నారిని కాపాడుకుందామని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

అకౌంట్ వివరాలు:

Account: 8265662545

Name: A S Nataraj

IFSC: IDIB000J028

Branch: J P NAGAR

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us