ఆత్రేయపురం పడవ పందేల ట్రయల్‌ రన్‌లో అపశృతి.. నీళ్లలో పడిపోయిన జిల్లా కలెక్టర్..!

Updated on: Jan 02, 2026 | 11:45 AM

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పడవ పందేల ట్రయల్‌ రన్‌లో అపశృతి చోటు చేసుకుంది. కయాకింగ్ బోట్‌ బోల్తా పడడంతో జిల్లా కలెక్టర్ నీళ్లలో పడిపోయారు. లైఫ్‌ జాకెట్‌ ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు కలెక్టర్‌ మహేష్‌ను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆత్రేయపురంలో సంక్రాంతికి నిర్వహించే పడవ పందాల కోసం ట్రయల్‌ రన్‌ జరుగుతోంది.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పడవ పందేల ట్రయల్‌ రన్‌లో అపశృతి చోటు చేసుకుంది. కయాకింగ్ బోట్‌ బోల్తా పడడంతో జిల్లా కలెక్టర్ నీళ్లలో పడిపోయారు. లైఫ్‌ జాకెట్‌ ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు కలెక్టర్‌ మహేష్‌ను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆత్రేయపురంలో సంక్రాంతికి నిర్వహించే పడవ పందాల కోసం ట్రయల్‌ రన్‌ జరుగుతోంది. వీటిని పరిశీలించేందుకు వచ్చిన అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్‌ కుమార్‌ ఓ కయాకింగ్‌ బోటు ఎక్కారు. అయితే కొద్ది దూరం వెళ్లాక, బోటు అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. దీంతో జిల్లా కలెక్టర్‌ మహిష్ సహా మరొకరు నీళ్లలో పడిపోయారు. వెంటనే అక్కడున్నవారు అప్రమత్తమై ఆయన్ను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. కాగా జనవరి 11, 12, 13 తేదీల్లో సంక్రాంతి ఉత్సవ్ పడవల పోటీలు ఆత్రేయపురంలో జరుగుతాయి. వీటి సమీక్షకే జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెళ్లారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..