కొడుకని తండ్రి చూడడు..తండ్రి కదా అని కొడుకు పట్టించుకోడు. ఇద్దరూ కలిసి పెగ్గుమీద పెగ్గులేస్తూ..బండ బూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి సీన్లు వీళ్లింట్లో చాలా కామన్. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుళ్ళ పాలెం వడ్డెర కాలనీ.. 45 ఏళ్ల వీరయ్య..ఇతడికి 25 ఏళ్ల కొడుకు అశోక్ అలియాస్ కిషోర్. కొడుకు తల నరికి..ఆ తలను సంచిలో వేసుకుని ఊరంతా తిరిగాడు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా. కిషోర్ తల్లి గల్ఫ్ దేశంలో ఉంటోంది..ఇల్లు గడవటం కూడా కష్టమైనందున..అప్పులు తీర్చడానికి పనికోసం దూర దేశం వెళ్లింది. అక్కడ పనులు చేస్తూ..వచ్చిన డబ్బులను కొడుకు కిషోర్‌కు పంపుతూ ఉండేది.
తండ్రి వీరయ్య మద్యానికి బానిసయ్యాడు. తండ్రి పంచన చేరి కొడుకు కూడా సేమ్ టు సేమ్ తయారయ్యాడు. బాప్ ఏక్ నెంబర్..బేటా దస్ నెంబర్ అన్నట్లు తయారైంది పరిస్థితి. ఇద్దరూ తాగినప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. అయితే తల్లి పంపిన డబ్బులను కిషోర్ తన దగ్గరే పెట్టుకునేవాడు. తాగుడుకు డబ్బులు కావాలంటే కొడుకునే అడగాలి వీరయ్య..నాలిక పీకుతోంది. మందు చుక్క తగలక దిక్కుతోచడం లేదు. కొడుకేమో డబ్బులివ్వడు. మందు యావ ఆగదు.. ఏం చేయాలి..పైగా.. కొడుకు కూడా తాగినప్పుడు తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. నువ్వేందిరా నన్ను చంపడం.. నేనే నిన్ను చంపిపారేస్తా అని తండ్రి కూడా అనడం జరిగాయి. ఇలాంటి సీన్లు చాలాసార్లు జరిగాయి. ఇరుగు పొరుగు ఇవన్నీ మామూలే అనుకున్నారు. కానీ..ఇద్దరిలోనూ భయం మొదలైంది. తండ్రి నిజంగా చంపుతాడేమోనని కొడుకు.. కొడుకే తనని చంపేస్తాడేమోనని తండ్రి అనుమానాలతో తిరిగేవాళ్లు.. కొద్దిరోజులుగా ఈ అనుమానాలు మరింత పెరిగాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తండ్రీ కొడుకుల మధ్య మరింత గొడవలు ముదిరాయి.. ఇక లేట్ చేయకూడదనుకున్నాడో ఏమో..తండ్రే..కొడుకును చంపేశాడు.. అశోక్‌ను వీరయ్య అతి దారుణంగా హత్య చేశాడు. తల..మొండెం వేరు చేశాడు. గల్ఫ్‌లో ఉంటున్న అశోక్ తల్లి సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందింది.. కొడుకు, కూతురుకు పెళ్లిళ్లు చేయడంతో ఐదు లక్షలు అప్పులయ్యాయని. అవి తీర్చేందుకే కువైట్ వచ్చానంటోంది. అశోక్ తల్లి బత్తుల అలివేలు కువైట్ వెళ్లి ఏడాది గడిచింది. ఒప్పందం ప్రకారం ఇంకా రెండేళ్లు అక్కడే ఉండాలి. కొడుకును చివరి చూపు చూసుకోవాలని ఎంత తపిస్తున్నా..యజమాని ఒప్పుకోవడం లేదు. ఎలాగైనా తనని ఇండియా తీసుకురావాలని కోరుకుంటోంది.
కొడుకును చంపి తండ్రి..అశోక్ తలను సంచిలో వేసుకుని ఊరంతా తిరుగుతున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. అశోక్ మృతదేహాన్ని నరసరావు పేట ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం