బాధ్యతలు స్వీకరించిన ఏపీ కొత్త మంత్రులు

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజధాని ప్రాజెక్టులో కచ్చితంగా అవినీతి వెలికి తీస్తామని చెప్పారాయన. ఏపీ ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. తనకు అప్పజెప్పిన బాధ్యతను ఓ ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేస్తామని అన్నారాయన. వైఎస్ హయాంలో ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారాయన. అలాగే.. ఏపీ మత్స్య, పశుగణాభివృద్ధి […]

బాధ్యతలు స్వీకరించిన ఏపీ కొత్త మంత్రులు
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2019 | 3:39 PM

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజధాని ప్రాజెక్టులో కచ్చితంగా అవినీతి వెలికి తీస్తామని చెప్పారాయన.

ఏపీ ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. తనకు అప్పజెప్పిన బాధ్యతను ఓ ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేస్తామని అన్నారాయన. వైఎస్ హయాంలో ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారాయన.

అలాగే.. ఏపీ మత్స్య, పశుగణాభివృద్ధి శాఖ మంత్రిగా మోపిదేవి వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. సీఎంగా జగన్‌ తనకు అప్పజెప్పిన బాధ్యతలను నెరవేరుస్తామని అన్నారాయన.