ఫ్రీగా కరోనా టెస్ట్‌లు..అందుబాటులోకి మొబైల్ వాహనాలు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచినా కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇటువంటి తరుణంలో కరోనా కట్టడిపై మరింత దృష్టి సారించిన ఏపీ సర్కార్ ..

ఫ్రీగా కరోనా టెస్ట్‌లు..అందుబాటులోకి మొబైల్ వాహనాలు..
Follow us

|

Updated on: Jul 08, 2020 | 1:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచినా కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇటువంటి తరుణంలో కరోనా కట్టడిపై మరింత దృష్టి సారించిన ఏపీ సర్కార్ …రాష్ట్రవ్యాప్తంగా టెస్టుల సంఖ్యను భారీగా పెంచింది. ఇప్పటికే దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. అంతేకాదు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మొబైల్ నమూనా సేకరణ వాహనాలు ప్రారంభించింది. ఒక్కో వాహనంలో 10 కౌంటర్లు ఉంటాయి. ఒకేసారి 10 మంది వారి వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు శాంపిల్స్ సేకరించేలా ప్రత్యేక ఏర్పాట్లలతో సిద్ధం చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 20 మొబైల్ నమూనా వాహనాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులు, రాష్ట్రాల సరిహద్ధు ప్రాంతంలోని చెక్ పోస్టుల దగ్గర ఈ వాహనాలను అందుబాటులో ఉంచారు. వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చే వారి నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నారు. సరిహద్దులోనే ప్రజల నుంచి నమూనాలు సేకరించి కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉపయోగపడుతున్నాయి. కంటైన్మెంట్ జోన్లలో కూడా ఈ వాహనాల ద్వారా బాధితుల నుండి శాంపిల్స్ సేకరించేందుకు వినియోగించవచ్చు. కంటైన్మెంట్ జోన్లలో నివసించే ప్రజలు టెస్టుల కోసం బయటకు రావాల్సిన అవసరం లేకుండా.. మొబైల్ వాహనమే వారి ప్రాంతానికి వెళ్లి నమూనాలు సేకరిస్తుంది. త్వరలోనే మరో 50 మొబైల్ టెస్టింగ్ వెహికిల్స్ ను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.

కాగా, విజయవాడ రైల్వే స్టేషన్, గాంధీ మున్సిపల్ హైస్కూల్, వన్ టౌన్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, మేరీమాత టెంపుల్, (గుణదల), కృష్ణలంక, బసవపున్నయ్య స్టేడియం, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ మొబైల్ వాహనాలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.