వాహనదారులకు జగన్ సర్కార్ శుభ‌వార్త‌ !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి రోడ్డు ట్యాక్స్ కట్టేందుకు గడువు పెంచాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు.

వాహనదారులకు జగన్ సర్కార్  శుభ‌వార్త‌ !
Follow us

|

Updated on: Jul 31, 2020 | 2:36 PM

AP road tax deadline  : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి వెహిక‌ల్ ట్యాక్స్ కట్టేందుకు గడువు పెంచాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో రోడ్డు ట్యాక్స్ కట్టేందుకు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియనుంది. అయితే ప్ర‌స్తుతం వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉండ‌టం, లాక్‌డౌన్ కారణంగా ఆటో, టాక్సీ న‌డుపుకునేవారు క‌ష్టాల్లో ఉన్న నేప‌థ్యంలో..కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రోడ్డు ట్యాక్స్ క‌ట్టే గడువు సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దీనిపై సాయంత్రం జ‌గ‌న్ స‌ర్కార్ అధికారిక ఉత్తర్వులు ఇవ్వనుందని సమాచారం.

Read More : రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

లాక్‌డౌన్ సమయంలో మోటార్ వెహికల్ ట్యాక్స్ చెల్లించేందుకు గ్రేస్ పిరియడ్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 30తో ట్యాక్స్ చెల్లింపు పూర్త‌వుతుంద‌న్న స‌మయంలో.. ట్యాక్స్ చెల్లింపుకు జూన్ 30 వరకు అవకాశ‌మిచ్చింది. అయితే మ‌ళ్లీ ఆ గ‌డువ‌ను పెంచ‌గా..నేటితో కంప్లీట్ అవుతుంది. వాహ‌న‌ ట్యాక్స్ అడ్వాన్స్‌గా చెల్లిస్తుంటారు. ప్రతి మూడు నెల‌ల‌కొక‌సారి ఈ చెల్లింపులు జ‌ర‌పాలి. సకాలంలో వాహ‌న‌ ట్యాక్స్ చెల్లించని పక్షంలో ఫైన్ వేస్తారు. అదికూడా 50 శాతం నుంచి 200 శాతం వరకు భారీ జ‌రిమానాలు ఉంటాయి. లాక్‌డౌన్ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ట్యాక్స్ చెల్లింపుల విషయంలో వాహనదారులకు స్వల్ప ఊరట క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read More : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్ : సబ్సిడీ డబ్బులు బంద్ !

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో