నేడు బెంగాల్, ఒడిశాలలో ప్రధాని పర్యటన..

‘ఉమ్‌పున్’ తుఫాన్ కారణంగా అతలాకుతలం అవుతున్న పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ముందుగా ప్రధాని బెంగాల్‌లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్ధన మేరకు మోదీ ఈ పర్యటన చేయనున్నారు. అటు ఒడిశాలో సైతం ప్రధాని ఏరియల్ సర్వే చేసి.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై చర్చించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘ఉమ్‌పున్’ తుఫాన్‌గా మారి ఒడిశా, బెంగాల్‌ […]

నేడు బెంగాల్, ఒడిశాలలో ప్రధాని పర్యటన..
Follow us

|

Updated on: May 22, 2020 | 1:05 AM

‘ఉమ్‌పున్’ తుఫాన్ కారణంగా అతలాకుతలం అవుతున్న పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ముందుగా ప్రధాని బెంగాల్‌లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్ధన మేరకు మోదీ ఈ పర్యటన చేయనున్నారు.

అటు ఒడిశాలో సైతం ప్రధాని ఏరియల్ సర్వే చేసి.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై చర్చించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ‘ఉమ్‌పున్’ తుఫాన్‌గా మారి ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. కాగా, బెంగాల్‌లో ఈ తుఫాన్ కారణంగా ఏకంగా 72 మంది మృత్యువాతపడ్డారు.

Read This: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. రైల్వేశాఖ మరో కీలక ప్రకటన..