America: సెక్స్ వర్కర్‌తో హెటల్‌కు.. ఆ తర్వాత అసలు సీన్.. యూఎస్‌లో అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థి

దేశం కానీ దేశం పోయి ఇవేం పనులురా బాబు. అక్కడ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుసుగా. చేసిందే తప్పుడు పని.. అది చాలదన్నుట్లుగా మళ్లీ డబ్బులు కోసం కొట్లాట. యూఎస్‌లో ఓ తెలుగు వ్యక్తి.. శృంగారం మోజులో అడ్డంగా బుక్కయిన ఘటన ఇది. వివరాలు తెలుసుకుందాం పదండి.

America: సెక్స్ వర్కర్‌తో హెటల్‌కు.. ఆ తర్వాత అసలు సీన్.. యూఎస్‌లో అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థి
Vineeth Ravuri

Updated on: Apr 12, 2023 | 1:31 PM

ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే… అమెరికాలో ఉన్నత విద్య …ఉద్యోగం కోసం వెళ్లిన తెలుగు యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. సెక్స్‌వర్కర్‌పై దాడి కేసులో అరెస్టయ్యాడు వినీత్‌ రావూరి. న్యూజెర్సీ లోని సెకాసస్‌ ప్రాంతంలో అలాఫ్ట్‌ హోటల్‌లో జరిగిన ఘటనలో వినీత్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

అలోఫ్ట్‌ హోటల్‌లో ఓ సెక్స్‌వర్కర్‌తో బస చేశాడు వినీత్‌ రావూరి. అయితే డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తానిచ్చిన డబ్బులు వెంటనే రిటర్న్‌ చేయాలని సెక్స్‌ వర్కర్‌ను అడిగాడు వినీత్‌. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేశాడు. రూమ్‌ నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన మహిళ హోటల్‌ లోని లాంజ్‌లో కుప్పకూలింది.  హెటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వినీత్‌ రావూరిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంతో కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తునట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై సాయుధ దోపిడీ [2C:15-1a(1)], తీవ్ర దాడి [2C:12- 1b(1)], క్రిమినల్ నియంత్రణ [2C:13-2], చట్టవిరుద్ధమైన ప్రయోజనం కోసం ఆయుధాన్ని కలిగి ఉండటం [2C :39- 4(d)], చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉండటం [2C:39-5(d)],  వ్యభిచారంలో పాల్గొనడం [2C:34- 1b(1)] వంటి అమెరికన్ సెక్షన్లతో కేసు ఫైల్ చేశారు. ప్రజంట్ వినీత్‌ను హడ్సన్ కౌంటీ జైలులో ఉంచారు. (Source)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..