న్యూయార్క్ జడ్జిగా ఇండో అమెరికన్ సరితా కోమటిరెడ్డి..!

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 5:12 PM

అగ్రరాజ్యం అమెరికాలో మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి దక్కనుంది. భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డి యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జడ్జిగా నామినేట్‌ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల

న్యూయార్క్ జడ్జిగా ఇండో అమెరికన్ సరితా కోమటిరెడ్డి..!
Follow us on

అగ్రరాజ్యం అమెరికాలో మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి దక్కనుంది. భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డి యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జడ్జిగా నామినేట్‌ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు.

అయితే హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా అందుకున్న సరితా కోమటిరెడ్డి.. హార్వర్డ్‌ లా స్కూల్‌ నుంచి జ్యూరిస్‌ డాక్టర్‌గా పట్టా సాధించారు. ఆ తరువాత న్యాయశాస్త్రానికి సంబంధించిన విభాగంలో పలు స్కూల్లో లెక్చరర్‌గా పనిచేశారు. అనంతరం పలు అమెరికా న్యాయవ్యవస్థలోని వివిధ భాగాల్లో సరితా కోమటి రెడ్డి పనిచేశారు. ప్రస్తుతం యూఎస్‌ అటార్నీ ఆఫీస్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జనరల్‌ క్రైమ్స్‌ డిప్యూటీ చీఫ్‌గా పనిచేస్తున్నారు.