Alabama deadly crash: అమెరికాలో విహారయాత్ర విషాదం.. రెండు వాహనాలు ఢీ.. డ్రైవర్‌తో సహా 10 మంది చిన్నారుల మృతి

అగ్రరాజ్యం అమెరికాలో విహారయాత్ర విషాదం నింపింది. అల‌బామా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది ప్రాణాలను కోల్పోయారు.

Alabama deadly crash: అమెరికాలో విహారయాత్ర విషాదం.. రెండు వాహనాలు ఢీ.. డ్రైవర్‌తో సహా 10 మంది చిన్నారుల మృతి
Alabama Deadly Crash

Updated on: Jun 22, 2021 | 2:49 PM

Alabama deadly crash: అగ్రరాజ్యం అమెరికాలో విహారయాత్ర విషాదం నింపింది. అల‌బామా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది చిన్నారులతో సహా 10మంది ప్రాణాలను కోల్పోయారు. అలబామాలోని ఇంటర్‌స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది దుర్మర‌ణం పాల‌య్యారు. వారిలో 9 మంది చిన్నారులే ఉన్నారు. మృతిచెందిన చిన్నారులంతా 3 నుంచి 17 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సు వారే ఉన్నారు. ఓ బీచ్‌లో విహార‌యాత్రకు వెళ్లిన చిన్నారులు వ్యాన్‌ తిరిగి ప్రయాణం అయ్యింది. ఇదేక్రమంలో రెండు వాహనాలు బలంగా ఢీకొవడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

అల‌బామాలో గ‌త కొన్ని రోజులుగా టొర్నడోలు విజృంభిస్తుండ‌టంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వ‌ర‌ద‌నీటిలో కొట్టుకొచ్చిన వాహ‌నాలు ఒక‌దానికొక‌టి ఢీకొంటూ చిన్నారులు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఢీకొన్నాయి. దీంతో వ్యాన్‌లో మంట‌లు చెల‌రేగి డ్రైవ‌ర్ స‌హా చిన్నారులంతా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 17 వాహ‌నాలు ఒక‌దానికి ఒక‌టి ఢీకొన‌గా అందులో ఏడు వాహ‌నాలు ద‌గ్ధమ‌య్యాయి. మిగ‌తా వాహ‌నాల్లో మ‌నుషులు లేక‌పోవ‌డంతో పెనుప్రమాదం త‌ప్పింది. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Read Also… GHMC water bills: గ్రేటర్ వాసుల వాటర్ కష్టాలు.. భాగ్యనగరవాసుల దక్కని ఫ్రీ ఫలం.. ఐదింతల బిల్లుతో హడలిపోతున్న జనం  

Loading...
Unable to load recommendations.
Follow Us