Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

అందులో వల్గారిటీ ఏం లేదు: విమర్శకులకు పూజా సమాధానం

Pooja Hegde about Ala Vaikuntapurramloo, అందులో వల్గారిటీ ఏం లేదు: విమర్శకులకు పూజా సమాధానం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్లలోనూ రాణిస్తోంది. అయితే ఇందులో పూజా హెగ్డేకు సంబంధించిన ఓ సీన్‌పై విమర్శలు వచ్చాయి. గత సినిమాల్లో హీరోయిన్లను పెద్ద ఇబ్బందిగా ఎప్పుడూ చూపించని త్రివిక్రమ్.. ఈ సారి పూజా హెగ్డేను వల్గారిటీ కోసం వాడుకున్నారని కామెంట్లు వచ్చాయి. ఆమె తొడలపై ఫోకస్ పెట్టడంతో పాటు సామజవరగమన పాటలోనూ త్రివిక్రమ్ కొంచెం ఇబ్బందిగా చూపించారంటూ విమర్శకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ క్రమంలో వీటిపై పూజా స్పందించింది.

ఎన్నో సినిమాల్లో అమ్మాయిలను ఇబ్బందిగానే చూపిస్తారు. షార్ట్ కాకుండా లంగా ఓణి వేసుకున్నా, నడుం చూస్తారు. కానీ అల వైకుంఠపురములో అలా చూపించలేదు. ఇక పాటలోనూ తాను ఎంత అందంగా నడుస్తాను అన్న దానిపై లిరిక్స్ రాశారు కానీ.. నా కాళ్ల గురించి కాదు అంటూ చెప్పుకొచ్చింది. కాగా అల వైకుంఠపురములోతో ఈ ఏడాది మొదటి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే.