Breaking News
  • కరోనా అప్డేట్ తెలంగాణలో ఇవాళ కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు 487 కరోనా పాజిటివ్ కేసులు . ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 430 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • మై హోం గ్రూప్ సంస్ధల విరాళం. కరోనా ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి సాయమందించిన మై హోం గ్రూప్. ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి 3 కోట్ల రూపాయల చెక్ ని అందించిన మై హోం ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టర్ జూపల్లి రామ్, శ్యామ్ రావు .
  • అమరావతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనలు మార్పు చేస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన గవర్నర్... వెంటనే ఆర్డినెన్స్ పై జీవో జారీ చేసిన ప్రభుత్వం
  • ఈరోజు ముంబై లో 218 కరోనా పాజిటివ్ కేస్ లు, 10 మంది మృతి ఇప్పటి వరకు ముంబై లో 993 చేరిన కరోనా పాజిటివ్ కేసులు.
  • భారత్‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదని తేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. గతంలో ఇచ్చిన నివేదికలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఉందని పేర్కొన్న డబ్ల్యూహెచ్ఓ. అది పొరపాటుగా అంగీకరిస్తూ సవరణ చేసిన డబ్ల్యూహెచ్ఓ. దేశంలో కేవలం క్లస్టర్లుగా మాత్రమే కేసులున్నాయని వివరణ.

బిగ్‌బాస్‌-3కి ‘కింగ్’ రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా..?

Akkineni Nagarjuna charges Rs.5 crore for Bigg boss 3 Hosting, బిగ్‌బాస్‌-3కి ‘కింగ్’ రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా..?

కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, హిందీ, బెంగాలీ భాషల్లో ఆల్‌టైం నెంబర్‌ వన్ షోగా బిగ్‌బాస్ షో.. చాలా పాపులర్ అయ్యింది. దేశంలోనే ది బిగ్గెస్ట్ షోగా మంచి రేటింగ్‌ను సంపాదించుకుంది. ఊహకి అందని విధంగా బిగ్‌బాస్ ఇచ్చే ట్విస్ట్‌లతో హౌస్‌మెంట్స్ ఎలా ప్రవర్తిస్తారు..? ఫొన్‌ లేకుండా.. టీవీ లేకుండా.. ఇతర వ్యక్తులతో సంబంధం లేకుండా.. కేవలం హౌస్‌లోని సభ్యులతోనే.. వారు ఏవిధంగా ఉంటారు..? అత్యవసర సమయాల్లో వారు ఎలా ప్రవర్తిస్తారు..? అనేది బిగ్‌బాస్ షో ప్రధాన అంశం.

ఇదంతా బాగానే ఉన్నా.. హౌస్‌మెంట్స్‌కి బయట జరిగే విషయాలను.. వారు చేసే తప్పులను చూపిస్తూ.. వారిని సరైనదారిలో పెట్టేందుకు ఓ పవర్ ఫుల్ వ్యక్తి కావాలి. అలా ఇప్పటికే.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో కింగ్ నాగ్ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇక వివాదాస్పద రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’కు కూడా హోస్ట్‌గా తన దైన స్టైల్లో.. షోని నడిపించి ఔరా అనిపించారు. అయితే.. ఇంత పెద్ద యాక్టర్.. సినిమాలను, మిగతా పనులను పక్కన పెట్టి.. కేవలం బిగ్‌బాస్ షో మీదనే 100 రోజులు ఫోకస్ చేయడం మాములు విషయమా..? మరి ఇందుకు గాను.. కింగ్ నాగ్ ఈ షోకి ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది కదా..! మరి ఆయన ఎంత తీసుకున్నారో తెలుసా.. రూ.5 కోట్లు. అవును మీరు విన్నది నిజమే.. అక్షరాల ఐదు కోట్లు తీసుకున్నారు నాగార్జున.

బిగ్‌బాస్ సీజన్స్ 1,2లు చేసిన ఎన్టీఆర్, నానీల కంటే.. నాగార్జునే అత్యధిక పారితోషికం తీసుకున్నారు. సీజన్ 1.. 74 రోజులకి ఎన్టీఆర్ 2.5 కోట్లు తీసుకోగా.. నాని 100 రోజులకి 3 కోట్లు తీసుకున్నారు. నాగార్జునకి ఒక ఎపిసోడ్‌కి స్టార్ మా రూ.12 లక్షలు ఇచ్చిందట. ఇలా మొత్తంగా 100 రోజులకి 5 కోట్లన్నమాట. అలాగే.. షో స్టార్టింగ్‌లోనే.. ఫుల్ రేటింగ్‌తో దూసుకెళ్లిపోయారు అక్కినేని నాగార్జున.

Akkineni Nagarjuna charges Rs.5 crore for Bigg boss 3 Hosting, బిగ్‌బాస్‌-3కి ‘కింగ్’ రెమ్యునరేషన్.. ఎంతో తెలుసా..?

Related Tags