Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

స్మోకింగ్ కంటే వాయు కాలుష్యం డేంజర్‌నా..?

, స్మోకింగ్ కంటే వాయు కాలుష్యం డేంజర్‌నా..?

స్మోకింగ్ చేసినప్పుడు వచ్చే గాలి కంటే వాయు కాలుష్యం వల్ల వచ్చే నష్టాలు ఎక్కవని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య శాఖ అధికారులు. వాయు కాలుష్యంపై రీసెర్చ్ నిర్వహించిన అధికారులు విస్తుపోయే ఆశ్చర్యాలను చూశారని తెలిపారు.

స్మోకింగ్ వల్ల వచ్చే కాలుష్యం 40 శాతం అయితే, వాయు కాలుష్యం వల్ల వచ్చే కాలుష్యం 60 శాతమని కనుగొన్నారు. WHO అంచనా ప్రకారం 2015లో ధూమపానం కారణంగా 7.2 మిలియన్ల మంది మరణించారని.. వాయు కాలుష్యం కారణంగా 8.8 మిలియన్ల మంది మరణించారని తెలిపారు.

, స్మోకింగ్ కంటే వాయు కాలుష్యం డేంజర్‌నా..?

ఈ వాయు కాలుష్యం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముందని తెలిపారు. వాహన ఎగ్సాస్ట్ పొగలు, కర్మాగారాలు, పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే పొగలు, కాలుష్యం పొగత్రాగడం వల్ల వచ్చే నష్టాలకంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారయ్యాయని తెలిపారు. ధూపపానం కంటే వాయుకాలుష్యం బారిన పడి చాలా మంది మరణిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రపంచఆరోగ్య సంస్థ (WHO) గాలి కాలుష్యం వల్ల 2010లో 4.5 మిలియన్ల మంది చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం ఇది ఎక్కువగా 8.8 మిలియన్స్ కు చేరుకుందని వెల్లడించారు. వీరు ఎక్కవగా గుండెజబ్బులకు గురై చనిపోతున్నారని చెప్పారు. ఎక్కువగా అధికసంఖ్యలో యూరప్‌లో ఈ గాలి కాలుష్యం వల్ల చనిపోతున్నారని పరిశోధకులు ప్రొఫెసర్ జోస్ లెలీవెల్డ్ చెప్పారు.

, స్మోకింగ్ కంటే వాయు కాలుష్యం డేంజర్‌నా..?

కార్లు, బస్సులు మరియు లారీల ద్వారా వెలువడే ఈ నత్రజనిలో ప్రాణాంతక హాని కలింగించే రసాయానాలు ఉన్నాయిని చెప్పారు. ఇవి ఊపిరితిత్తులలోకి గాలి ద్వారా చేరి మెల్లగా రక్తనాళాల్లోకి ప్రవేశిస్తాయని తద్వారా పలు రకాల వ్యాధులు సంభవిస్తాయని తెలిపారు. ఇదివరకే ఆసియాలోని భారతదేశ రాజధాని ఢిల్లీలో భయంకరమైన గాలి కాలుష్యం ఉద్భవించింది. దీనికి అధికారులు పలు ఆంక్షలు కూడా సూచించారు. అలాగే ఆ గాలి పీల్చి పలువురు మరణించారు కూడా.

పాడైన వాహనాల ద్వారా మరితం గాలి కలుషితమవుతుందని గుర్తించారు శాస్త్రవేత్తలు. 30, 20 సంవత్సరాల క్రితం వాహనాలను వాడరాదని సూచించారు. కేవలం వాహనాల ద్వారానే కాకుండా చెత్త, అలాగే.. టపాసుల కారణంగా కూడా గాలి కలుషితమవుతుందని తెలిపారు. వీటి వల్ల ముఖ్యంగా శ్వాసకోస వ్యాధు వస్తున్నాయని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు ముక్కుకు క్లాత్ పెట్టుకుని వెళ్లడం మంచిదని సూచించారు. అప్పుడప్పుడు మెడికల్ టెస్ట్ లు కూడా చేపించుకుంటూ ఉండటం వల్ల వచ్చే ప్రమాదాలు ఉన్నా వాటిని ముందే గమనించవచ్చని సూచించారు. అలాగే..వీలైనంతవరకూ మొక్కలను పెంచితే మంచి గాలి ఫామ్ అవుతుందని తెలిపారు.

, స్మోకింగ్ కంటే వాయు కాలుష్యం డేంజర్‌నా..?