కరోనా పరీక్షలు పెంచాల్సిందే.. అక్బరుద్దీన్‌ ఓవైసీ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారితో పోరాడాలంటే.. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని.. లేదంటే మనం ఈ వైరస్‌ను ఎదుర్కోలేమని మజ్లీస్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.

కరోనా పరీక్షలు పెంచాల్సిందే.. అక్బరుద్దీన్‌ ఓవైసీ..
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2020 | 6:04 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారితో పోరాడాలంటే.. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని.. లేదంటే మనం ఈ వైరస్‌ను ఎదుర్కోలేమని మజ్లీస్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. నగర పరిధిలో ఇరవై వేల కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు లేఖ రాశారు. దీనికి సంబంధించిన లేఖను అసుదుద్దీన్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నాంపల్లి నియోజకవర్గం పరిధిలో రెండు వేల పరీక్షలు చేయాలని.. లేదంటే ఈ మహమ్మారిని జయించలేమని అభిప్రాయపడ్డారు.

కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మన గ్రేటర్‌ పరిధిలోనే నమోదవుతున్నాయి. దీంతో నగర వాసులు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు. దీంతో మరోసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్‌డౌన్ పెట్టాలన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.