రాణి గారి ఆస్తులు వంద కోట్లు.. ఈఎస్ఐ కేసులో లీలలెన్నో!

దేవికారాణి ఆస్తుల చిట్టా షాక్ గురిచేస్తోంది. ఈఎస్ఐ స్కామ్‌ని విచారిస్తున్న ఏసీబీ ఆమె ఆస్తుల చిట్టాను విడుదల చేసింది. మొత్తం వందకోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను దేవికారాణి కూడబెట్టినట్లు ఏసీబీ రిపోర్టులో వెల్లడైంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ దేవికారాణికి భారీగా స్థిరాస్తులున్నట్లు ఏసీబీ వెల్లడించింది. దేవికారాణి అక్రమాల్లో ఆమె భర్త, రిటైర్డ్ సివిల్ సర్జన్ గురుమూర్తి సహకరించినట్లు ఏసీబీ వెల్లడించింది. నారాయణగూడలోని ఇండియన్ బ్యాంక్ లో 34 లక్షల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లున్నట్లు గుర్తించారు. […]

  • Rajesh Sharma
  • Publish Date - 6:55 pm, Thu, 5 December 19

దేవికారాణి ఆస్తుల చిట్టా షాక్ గురిచేస్తోంది. ఈఎస్ఐ స్కామ్‌ని విచారిస్తున్న ఏసీబీ ఆమె ఆస్తుల చిట్టాను విడుదల చేసింది. మొత్తం వందకోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను దేవికారాణి కూడబెట్టినట్లు ఏసీబీ రిపోర్టులో వెల్లడైంది.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ దేవికారాణికి భారీగా స్థిరాస్తులున్నట్లు ఏసీబీ వెల్లడించింది. దేవికారాణి అక్రమాల్లో ఆమె భర్త, రిటైర్డ్ సివిల్ సర్జన్ గురుమూర్తి సహకరించినట్లు ఏసీబీ వెల్లడించింది. నారాయణగూడలోని ఇండియన్ బ్యాంక్ లో 34 లక్షల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లున్నట్లు గుర్తించారు. మరో 23 బ్యాంకుల్లో కోటీ 23 లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ.. దేవికారాణి ఇంట్లో 25 లక్షల 72 వేల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సీజ్ చేసినట్లు వెల్లడించింది.

దేవికారాణి ఇంట్లో 8 వేల 40 వేల రూపాయల నగదు, 7 లక్షల ఎలక్ట్రానిక్ వస్తువులు సీజ్ చేయగా.. 20 లక్షల రూపాయల విలువైన ఇన్నోవా కారు, 60 వేల మోటర్ బైక్‌లను కూడా స్వాధీనపరచుకున్నారు. వేర్వేరు చోట్ల మరో 15 కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించింది ఏసీబీ. మొత్తానికి దేవికారాణి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో 100 కోట్లపైగానే వుంటుందని ఏసీబీ వర్గాలే అంటున్నాయి.