మోదీ హవా: తిరోగమన సంకేతమా?

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు.. ఆయా రాష్ట్రాల వరకు పరిమితి కాకుండా.. దేశం మీద కూడా చాలా ప్రభావాన్ని చూపించాయి. ముఖ్యంగా బీజేపీ.. మహారాష్ట్ర, హర్యానాల్లో పెద్ద విజయం సాధించి.. త్వరలో జరగనున్న ఢిల్లీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్‌లో కూడా తమ సత్తాను చూపించాలని భావించింది.ఇక ఈ నెల 24వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఫలితాలకు వారం రోజుల కిందటి నుంచే మహారాష్ట్రలో 200 సీట్లు సాధిస్తామని.. హర్యానాలో 60-70 సీట్లు గెలుపొందుతామని బీజేపీ పబ్లిక్‌గా […]

మోదీ హవా: తిరోగమన సంకేతమా?
Follow us

| Edited By:

Updated on: Oct 26, 2019 | 8:36 AM

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు.. ఆయా రాష్ట్రాల వరకు పరిమితి కాకుండా.. దేశం మీద కూడా చాలా ప్రభావాన్ని చూపించాయి. ముఖ్యంగా బీజేపీ.. మహారాష్ట్ర, హర్యానాల్లో పెద్ద విజయం సాధించి.. త్వరలో జరగనున్న ఢిల్లీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్‌లో కూడా తమ సత్తాను చూపించాలని భావించింది.ఇక ఈ నెల 24వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఫలితాలకు వారం రోజుల కిందటి నుంచే మహారాష్ట్రలో 200 సీట్లు సాధిస్తామని.. హర్యానాలో 60-70 సీట్లు గెలుపొందుతామని బీజేపీ పబ్లిక్‌గా ప్రచారం చేసింది. ఇది వాళ్ల నేతలపై ప్రభావం చూపిందని చెప్పొచ్చు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. మహారాష్ట్రలో 288కి గాను 160 ఎమ్మెల్యేలతో మినిమమ్ మెజార్టీతో బీజేపీ గవర్నమెంట్‌ను ఏర్పాటు చేయనుండగా చేయనుండగా.. హర్యానాలో 90కి 40 రావడంతో.. ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందో ఇంకా తెలియాల్సి ఉంది. అంతేకాక మహారాష్ట్రలో శివసేన పార్టీ వల్ల బీజేపీ ప్రతిష్టకు భంగం వాటిల్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. ముంబైలో మూడు, హర్యానాలో ఒక్క సమావేశంతో రాహుల్ గాంధీ సరిపెట్టుకుంటే.. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రం ఎక్కడా ప్రచారం చేయలేదు. అయితే ఈ రెండు రాష్ట్రాల ఫలితాల్లో మాత్రం ఈ మార్పు ఏమి కనిపించలేదు. గాంధీ కుటుంబ సభ్యులు ప్రచారం చేసినా… చేయకపోయినా పరిణామాలు మాత్రం వారికి అనుకూలంగానే ఉన్నాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో చెప్పుకోదగ్గ రిజల్ట్స్ అయితే వచ్చాయి. కాకపోతే ఈ ఫలితాలు గాంధీ ఫ్యామిలీ ప్రస్టేజ్‌‌కు మాత్రం తప్పకుండా ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పక తప్పదు.. అసలు వాళ్ళకి చరిష్మా ఉందా..? లేక కేవలం హైపేనా అన్నది కొందరి భావన.

మరోవైపు నరేంద్ర మోదీ, అమిత్ షాలు.. దేశ రాజకీయాల్లోనే ఆరితేరారు.. అలాంటి వాళ్లు రాష్ట్ర ఎన్నికల్లో ఇంత ఎక్కువగా ప్రచారం చేయడం కరెక్టా కాదా అనేది మరోసారి ఆలోచించుకోవాలి. ఇక రెండు రాష్ట్రాల్లో వారు విస్తృతంగా ప్రచారం చేసిన తీరును చూస్తే.. ఆర్ధిక వ్యవస్థలో ‘డిమనిషింగ్ రిటర్న్స్’ అని పిలవచ్చు. దీని అర్ధం.. ఎక్కువ టైం ఇన్వెస్ట్మెంట్‌కు తక్కువ రాబడులు రావడమని అంటారు. ఆర్టికల్ 370, కశ్మీర్ అంశం గురించి మహారాష్ట్రలో ఎంత విపరీతంగా ప్రచారం చేసినా.. ఫలితాల్లో మాత్రం ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. మరోసారి ఆర్టికల్ 370 గురించి మోదీ ఎక్కడ ప్రస్తావించినా.. విలువ మాత్రం ఉందన్నంతగా ఓవర్ ఎక్స్‌పోజ్ అయినట్లుగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ తన పొలిటికల్ స్ట్రాటజీని ఏమైనా మార్చుకోవాలా? లేదా అక్కడక్కడ రాష్ట్రాల్లో మరీ డీప్‌గా వెళ్ళకపోవడం మంచిదా? అనేది గ్రహించాలి.

ఆర్ధిక వ్యవస్థ మందగమనం…

బీజేపీకి ప్రధాన సమస్య దేశ ఆర్ధిక వ్యవస్థ. రోజురోజుకి దేశ ఆర్ధిక వ్యవస్థ తగ్గు ముఖం పడుతోంది. దాన్ని సరి చేయడానికి తగిన చర్యలు కూడా తీసుకోవట్లేదు. రేటు లేక అనేక ఇండస్ట్రీలు మూతబడుతున్నాయి. ఎంతోమంది నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఉదాహరణకు  ముంబైలో చాలా ఫ్యాక్టరీలను మూసివేశారు. హర్యానా, గుర్గావ్, కరుల్‌బాగ్‌లో వేలమంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వీటన్నింటికి కూడా పరిష్కారాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఆర్ధిక వ్యవస్థలో లోపం వచ్చినప్పుడు తక్షణమే చర్యలు తీసుకుంటారు. కానీ మన కేంద్ర ప్రభుత్వం మాత్రం తగిన చర్యలు తీసుకోవట్లేదు.  ఇది బీజేపీకి పెద్ద మైనస్‌గా మారిందని చెప్పొచ్చు. దీని మీద ఎంత తొందరగా దృష్టి సారిస్తే కేంద్ర ప్రభుత్వానికి అంత మంచిది.

వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ…

2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. శరద్ పవార్ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో 3 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు వచ్చిన మోదీ గవర్నమెంట్ కూడా దానికి తగిన పరిష్కారం కనిపెట్టలేదని చెప్పాలి. రైతు భరోసా కింద 2000-3000 వరకు రైతులకు ఇస్తే సరిపోతుందా..? పన్నుల రూపంలో.. ఇన్‌పుట్స్ ధర విషయంలో చూస్తే.. రైతులకు చేతికి వచ్చేది ఏమి ఉండదు. రైతాంగం, ఫారం సెక్టార్ మీద ఇప్పటివరకు కూడా సరైన పరిష్కారాన్ని మోదీ ఆలోచించలేదు. దానికి తగ్గ మంత్రులు కూడా సెంట్రల్ గవర్నమెంట్‌లో లేరు. ఇందువల్లే వ్యవసాయంపై  ఎక్కువగా దృష్టి సారించే మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ గవర్నమెంట్‌కు చుక్కెదురు అయ్యింది.

ముఖ్యంగా బీజేపీ మహారాష్ట్రలోని మరాఠీలకు రిజర్వేషన్లు కల్పించి.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం ఎన్నో రోడ్లు కూడా నిర్మించారు. అయినా కూడా వారికి రిలీఫ్ దక్కలేదు. కాబట్టి ఒక్క విభాగంలోనే కాకుండా మిగతా వాటిల్లో కూడా బీజేపీ ప్రభుత్వం దృష్టి సారిస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉండచ్చు.  కాగా, ఈ ఎన్నికల ఫలితాల బట్టి చూస్తే బీజేపీ గవర్నమెంట్ కొన్ని విషయాలపై సమీక్ష చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అలా కాదని మొండి వైఖరితో ముందుకు సాగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాక కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ల స్థానిక నాయకుడికి ఫుల్ పవర్స్ ఇస్తే.. మంచి పరిణామాలు వస్తాయి. దీనిపై వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.

ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో హర్యానాలో బీజేపీ గవర్నమెంట్‌ను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది.. కానీ అది మాత్రం అంత బలంగా ఉండకపోవచ్చు. అటు మహారాష్ట్రలో కూడా శివసేనతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీనిపై అమిత్ షా.. సుదీర్ఘమైన మంతనాలు జరపాల్సి వస్తుంది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు చాలా సులభమని బీజేపీ అనుకున్నప్పటికీ ఆ విధంగా ఫలితాలు మాత్రం రాలేదు. కాబట్టి ఏ రాష్ట్ర ఎన్నికలను కూడా బీజేపీ తక్కువగా అంచనా వేయకూడదు. మితిమీరిన అంచనాలను పెట్టుకొని.. ఎక్కువ ప్రచారం చేసి.. అవి అందినప్పుడు మాత్రం దాన్ని ఖచ్చితంగా ఓటమగానే భావిస్తారు. ఇవాళ మహారాష్ట్ర, హర్యానా కూడా అదే జరిగింది. అందుకే భవిష్యత్‌లోనైనా అంచనాలను ఎక్కువగా పెట్టుకోకుండా.. ఆర్భటాలు చూపకుండా.. ప్రచారం చేయడమే బీజేపీకి మంచిది.