ఇవాళ్టి నుంచి పల్లెల ప్రగతికి శ్రీకారం.. ఊరూర కేసీఆర్ సందేశం

0-day action plan rollout today.. villages set to see transformation, ఇవాళ్టి నుంచి పల్లెల ప్రగతికి శ్రీకారం.. ఊరూర కేసీఆర్ సందేశం" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/09/kcr-2.jpg 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/kcr-2-300x180.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/kcr-2-768x461.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/kcr-2-600x360.jpg 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

తెలంగాణలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ఇవాళ్టి నుంచి పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రాభివృద్దికి పల్లెలే పట్టుకొమ్మలని సూచించిన సీఎం కేసీఆర్‌…గ్రామాభివృద్దికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకునే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన.. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విస్తృత ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా పారిశుధ్యం, పచ్చదనం, నిధుల సద్వినియోగం, విద్యుత్‌, పరిపాలనా విధులపై మంత్రులు, జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఈ పనులు ఊరూరా ఉత్సాహంగా సాగాలని, పెద్దఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రత్యేక ప్రణాళిక అమలుపై ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తుందని, ఇందుకోసం వంద బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఎం ఈ సందర్భంగా చెప్పారు. అలసత్వం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పల్లెల ప్రగతికోసం అమలుచేస్తున్న 30 రోజుల ప్రణాళికను ఇవాళ అధికారికంగా మొదలుకానున్నది. ప్రతి గ్రామానికి నియమితులైన స్పెషలాఫీసర్లు ఉదయం గ్రామాల్లో సభ నిర్వహించి, సీఎం కేసీఆర్ సందేశాన్ని వినిపిస్తారు. అనంతరం ఊరంతా తిరిగి పనులను గుర్తించనున్నారు. వాటిపై నివేదిక సిద్ధంచేసి, నిబంధనల ప్రకారం గ్రామసభ నిర్వహించి, గుర్తించిన పనులు, ముందుగా చేయాల్సినవాటిని వివరించనున్నారు.

ఇక శనివారం గ్రామాల్లో గ్రామకమిటీలు, కో ఆప్షన్ సభ్యుల ఎంపిక తర్వాత ఆది లేదా సోమవారం నుంచి తొలి ప్రాధాన్యపనులను మొదలుపెట్టనున్నారు. మొత్తం ఐదారు నెలల్లో గ్రామాలను సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్లు వేస్తున్నారు. గ్రామాల్లో పబ్లిక్‌రోడ్లు, మురుగుకాల్వలు, అడవుల నిర్వహణ, మట్టికుప్పలు, శిథిలాలు, పిచ్చిమొక్కల తొలిగింపు, వీధిదీపాల నిర్వహణ వం టి అంశాలను ప్రాధాన్యక్రమంలో చేపడుతారు. మరోవైపు రాష్ట్రంలోని పంచాయతీలకు ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 7312 కోట్లు రానున్నాయి. సగటున ఒక్కో పం చాయతీకి రూ.8 లక్షలు అందనున్నాయి. ఉపా ధి నిధులు కూడా ఈసారి ఎక్కువగానే వినియోగించుకునే అవకాశం ఉన్నది. అంతేకాకుండా స్వీయ ఆదాయం ద్వారా 500 జనాభా ఉన్న పంచాయతీలకు నెలకు లక్ష, పెద్ద పంచాయతీలకు రూ.4 నుంచి రూ.5 లక్షలు రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *