హుజూర్‌నగర్‌లో పెద్ద ఎత్తున నామినేషన్లు..?

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలోనూ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసేందుకు బీసీ సంఘాలు, స్థానిక నిరుపేదలు సిద్దమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసినట్లుగా వీరు కూడా చేయనున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్క ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో […]

హుజూర్‌నగర్‌లో పెద్ద ఎత్తున నామినేషన్లు..?
Follow us

|

Updated on: Jun 12, 2019 | 1:09 PM

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలోనూ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసేందుకు బీసీ సంఘాలు, స్థానిక నిరుపేదలు సిద్దమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసినట్లుగా వీరు కూడా చేయనున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్క ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ నియోజకవర్గం పై పడింది. బీసీల రిజర్వేషన్ల పెంపు డిమాండ్‌తో బీసీ సంఘాలు, మోడల్‌ కాలనీ నిర్మాణానికి సంబంధించి స్థానికులు తమ సమస్య పరిష్కారానికి ఉప ఎన్నికను వినియోగించుకోవాలని భావిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 34శాతం నుంచి 24శాతానికి తగ్గించడంపై ఆగ్రహంగా ఉన్న బీసీ సంఘాలు.. తిరిగి 34 శాతం రిజర్వేషన్‌ కోసం భారీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికలో 200 మంది బీసీలతో నామినేషన్లు వేయిస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఇప్పటికే ప్రకటించారు. ఇక స్థానికంగా మోడల్‌ కాలనీ కోసం నిరుపేదలు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. స్థానికంగా 20 ఏళ్లుగా ఇళ్లు లేక రోడ్ల వెంట, ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ కట్టలపై నివాసముంటున్న పేదలకు.. గూడు కల్పించే ఉద్దేశంతో మోడల్‌కాలనీ పేరిట పట్టణ పరిధిలోని ఫణిగిరి గట్టు వద్ద రూ.150 కోట్లతో వీరికి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అయితే రాజకీయ కారణాలతో ఇంటి నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో నిరుపేద కుటుంబాల ప్రజలు ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. ఉప ఎన్నికల్లో 300 మందికి తగ్గకుండా నామినేషన్లు వేసేందుకు సిద్దమయ్యారు.

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో