భారత ఆర్మీ దాడిలో 15 మంది పాక్‌ జవాన్లు, 8 మంది ఉగ్రవాదులు హతం..!

ఏప్రిల్ 10వ తేదీన.. భారత ఆర్మీ పాక్‌ కవ్వింపుచర్యలకు ధీటుగా సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో.. 15 పాక్ జవాన్లు హతమైనట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాదు.. మరో 8 మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఓ వైపు కరోనాతో దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంటే.. పాక్‌ మాత్రం తన వక్రబుద్దిని పోనివ్వకుండా.. తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కాల్పులకు దిగుతుండటంతో.. ఏప్రిల్ 10వ తేదీన […]

భారత ఆర్మీ దాడిలో 15 మంది పాక్‌ జవాన్లు, 8 మంది ఉగ్రవాదులు హతం..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 12, 2020 | 8:56 PM

ఏప్రిల్ 10వ తేదీన.. భారత ఆర్మీ పాక్‌ కవ్వింపుచర్యలకు ధీటుగా సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో.. 15 పాక్ జవాన్లు హతమైనట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాదు.. మరో 8 మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఓ వైపు కరోనాతో దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంటే.. పాక్‌ మాత్రం తన వక్రబుద్దిని పోనివ్వకుండా.. తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కాల్పులకు దిగుతుండటంతో.. ఏప్రిల్ 10వ తేదీన భారత సైన్యం ఆర్టిలరీ గన్స్‌తో దాడికి దిగింది. ఈ దాడిలో పాక్‌ భారీ నష్టాన్ని చవిచూసిందని అప్పుడే మనసైన్యం స్పష్టం చేసింది. టెర్రర్‌ లాంచింగ్‌ ప్యాడ్స్‌తో పాటుగా.. పాక్ ఆర్మీ లాంచింగ్‌ ప్యాడ్స్‌ కూడా ధ్వంసమైనట్లు వీడియో కూడా రిలీజ్‌ చేసింది ఇండియన్ ఆర్మీ. ఏప్రిల్ 5వ తేదీన కేరాన్ సెక్టార్‌లో భారత ఆర్మీ ఐదుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన విషయం తెలిసందే. అయితే భారత ఆర్మీ జరిపిన దాడి నిజమే అని చెప్పిన పాక్.. కేవలం నలుగురు పౌరులు మాత్రమే మృతిచెందినట్లు చెప్పుకొచ్చింది. కానీ భారత ఆర్మీ దాడిజరిపిన వీడియో రిలీజ్‌ చేస్తూ.. లాంచింగ్ ప్యాడ్స్‌ ధ్వంసమవ్వడమే కాదు.. పాకిస్థాన్‌కు భారీగా నష్టం వాటిల్లి ఉంటుందని స్పష్టం చేసింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు