హిందువుగా పుట్టా.. హిందువుగానే చస్తా.. వైవీ సుబ్బారెడ్డి

మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హిందువు కాదు.. క్రిస్టియన్ అని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ వైరల్‌గా మారడంతో ఆయన స్పందించారు. టీటీడీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు ఏపీ సీఎం జగన్. అధికారిక ఉత్తర్వులు రాకున్న సీఎం నిర్ణయమే ఫైనల్. దీంతో వైవీ సుబ్బారెడ్డి హిందూ కాదంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. హిందువు కాని వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం […]

హిందువుగా పుట్టా.. హిందువుగానే చస్తా.. వైవీ సుబ్బారెడ్డి
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 11:53 AM

మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హిందువు కాదు.. క్రిస్టియన్ అని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ వైరల్‌గా మారడంతో ఆయన స్పందించారు. టీటీడీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు ఏపీ సీఎం జగన్. అధికారిక ఉత్తర్వులు రాకున్న సీఎం నిర్ణయమే ఫైనల్. దీంతో వైవీ సుబ్బారెడ్డి హిందూ కాదంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. హిందువు కాని వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పీక్ స్టేజీకి చేరుకోవడంతో.. ఈ ఇష్యూపై స్పందించారు వైవీ సుబ్బారెడ్డి. తాను హిందువును కాదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డారు వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. కావాలనే తనపై కొందరు బురద జల్లుతున్నారని ఆరోపించారు. తిరుమల వెంకన్న తన ఇష్టదైవమని చెప్పుకొచ్చారు. టీటీడీ ఛైర్మన్ పదవికి జగన్ తన పేరు ప్రతిపాదించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తనకు అప్పగించిన పదవిని బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని తెలిపారు. తాను పుట్టింది హిందువుగా అని.. తన చనిపోవడం కూడా హిందువుగానే అని తేల్చిచెప్పారు.